గౌతంరెడ్డి ఇంకా జనం గుండెల్లో గూడుకట్టుకుని ఉన్నారు

 బ్రాహ్మణపల్లిలో మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రథమ వర్ధంతి
 

 శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లిలో నిర్వహించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని గౌతమ్ రెడ్డికి నివాళులు అర్పించారు. 

మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మికంగా మృతి చెంది ఏడాది అయినా ఇంకా జనం గుండెల్లో గూడుకట్టుకుని ఉన్నారు. మరువలేని నేతను.. మరోసారి స్మరించుకునేందుకు అభిమానులు వర్ధంతి కార్యక్రమానికి తరలివచ్చారు. ఇందుకుతగ్గట్టుగానే కుటుంబ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని పలువురు ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మేకపాటి అభిమానులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా  వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Back to Top