అమరావతి: నేటికి కూడా పోలీసు వ్యవస్థ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేత నందిగం సురేష్ అన్నారు.రాజధానికి భూములు ఇవ్వలేదని దౌర్జనకాండకు దిగడం దారుణమన్నారు. రైతుల హక్కులను కాలరాసి దౌర్జన్యపూరితంగా ముందుకెళ్తుందని ధ్వజమెత్తారు. ఏకపక్ష నిర్ణయాలతో రైతులపై దాష్టీకానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతు మీరా ప్రసాద్‌పై బలవంతంగా దాడిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప..సమస్యను పరిష్కరించేవిధంగా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదన్నారు. ప్రభుత్వం మొండివైఖరీతో వ్యవహరిస్తుందన్నారు.టీడీపీ పాలన రౌడీ పాలనను తలపిస్తుందన్నారు.మానవత దృక్ఫథం అనేది పూర్తిగా లోపించిందన్నారు.హైకోర్టు స్టేను కూడా తుంగలో తొక్కారన్నారు.వైయస్‌ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రైతులకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు: రాజధానికి భూములు ఇవ్వలేదని అధికారులు,పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. హైకోర్టు స్టే ఉన్నా పట్టించుకోలేదు. రాజధానికి భూమి ఇవ్వని పొలంలో రోడ్డు వేసేందుకు ఏడీసీ అధికారుల యత్నించగా.. రైతు గద్దె మీరా ప్రసాద్,ఆయన కుటుంబసభ్యులు అడ్డుకున్నారు.రైతు మీరా ప్రసాద్‌ను,ఆయనకు మద్దతుగా వచ్చిన స్థానిక రైతులను అరెస్ట్ చేశారు. పోలీసులు మోహరింపుతో రోడ్డు వేసి తీరతామని ఏడీసీ అధికారులు మొండివైఖరీ అవలంభించారు. రైతు ప్రసాద్‌కు వైయస్‌ఆర్‌సీపీ మద్దతుగా నిలిచింది. వైయస్‌ఆర్‌సీపీ నేతలు,రైతులు వెళ్ళిపోవాలంటూ డీఎస్పీ కేశప్ప ఆదేశాలు జారీచేశారు. ఎవరైనా వస్తే కేసులు పెడతామని పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు.