చంద్రబాబు అక్రమార్జన సింగపూర్‌కు వెళ్లింది

మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు
 

కాకినాడ: హవాలా ద్వారా చంద్రబాబు తన అవినీతి సొమ్మును  సింగపూర్‌కు తరలించారని వైయస్‌ఆర్‌సీపీ నేత, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు సింగపూర్‌కు పంపిన బ్లాక్‌ మనీ విదేశీ పెట్టుబడుల రూరంలో వైట్‌ మనీగా మనకు వస్తుందని పేర్కొన్నారు.  పెట్టుబడి సదస్సుకు వచ్చిన వారంతా కూడా చంద్రబాబు మనుషులే. నష్టాల్లో ఉన్న డ్రెజ్జింగ్‌ కార్పొరేషన్‌ను ఉపయోగించుకుని హవాలా సొమ్ము ద్వారా ప్రైవేట్‌ భాగస్వామ్యంతో హార్బర్‌ను నిర్మించాలనుకున్నారు.ఇదే రకంగా ఎన్నో విదేశీ షెల్‌ కంపెనీలు ఏపీకి రావడానికి ప్రయత్నించాయి. చంద్రబాబు సీఎం కాగానే లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఇవన్నీ చంద్రబాబు షేల్‌ కంపెనీలే.ఈ కుంభకోణంలో చంద్రబాబు ప్రమేయం ఉంది.

తాజా వీడియోలు

Back to Top