రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములమవుతాం

సీఎం వైయస్‌ జగన్‌పై ఉన్న అభిమానంతో వైయస్‌ఆర్‌సీపీలో చేరాం

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత గాదె వెంకట్‌రెడ్డి

 

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై ఉన్న అభిమానం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలని వైయస్‌ఆర్‌ సీపీలో చేరానని మాజీ మంత్రి గాదె వెంకట్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమక్షంలో గాదె వెంకట్‌రెడ్డి, ఆయన కుమారుడు గాదె మధుసూదన్‌రెడ్డిలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. అనంతరం గాదె వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వామిని కావడానికి వైయస్‌ఆర్‌ సీపీలో చేరడం జరిగిందని వివరించారు. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశాడన్నారు. తెలుగుదేశం పార్టీకి వందల మంది అనుచరులతో రాజీనామా చేయించి ఈ రోజు వైయస్‌ఆర్‌ సీపీలో చేరడం జరిగిందన్నారు. వైయస్‌ జగన్‌ చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని, ఏ పదవి ఆశించకుండానే పార్టీలో చేరామన్నారు.

జీవితాంతం వైయస్‌ఆర్‌ సీపీలో ఉంటా: మధుసూదన్‌రెడ్డి
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో 2002 నుంచి పరిచయం ఉన్నా.. కొన్ని కారణాలతో దూరమయ్యాను. ఒక మంచి నాయకుడికి దూరమయ్యానని చాలా కాలంగా బాధపడుతున్నాను. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను ఆరు నెలల్లోనే నెరవేర్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. బతికి ఉన్నంత వరకు వైయస్‌ఆర్‌ సీపీలో ఉంటా. సీఎం ఏ పని అప్పగించినా సమర్థవంతంగా చేస్తాను.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top