పిల్ల‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా బ‌డికి పంపించాలి

డిప్యూటీ సీఎం రాజన్నదొర 

విశాఖ‌:  ప్ర‌తి త‌ల్లి త‌మ బిడ్డ‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా బ‌డికి పంపించాల‌ని, వారిని చ‌దివించే బాధ్య‌త సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకుంటార‌ని డిప్యూటీ సీఎం రాజ‌న్న దొర అన్నారు. బుధ‌వారం మెంటాడ లో నిర్వహించిన మండల స్థాయి జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక  కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు,గిరిజన శాఖా మాత్యులు పీడిక.రాజన్నదొర హాజ‌ర‌య్యారు.  విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ల ను, తల్లులకు జగనన్న అమ్మఒడి చెక్కులను ఆయన చేతులు మీదుగా పంపిణీ చేశారు.  కార్యక్రమంలో ఇంగ్లీషులో మాట్లాడిన విద్యార్థులను డిప్యూటీ సీఎం రాజన్నదొర అభినందించి వారితో కలిసి ఫోటో దిగారు. కార్యక్రమంలో మెంటాడ మండల ఎంపీపీ రెడ్డి.సన్యాసి నాయుడు, వైస్ ఎంపీపీలు సారిక, ఈశ్వర రావు, దుర్గ , జడ్పీటిసి రత్నాకర్, ఎంపీటీసీలు, స‌ర్పంచ్‌లు పాల్గొన్నారు.
 

Back to Top