అమరావతి: కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొట్ట మొదటి స్థానంలో ఉందని డిప్యూటి సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. కరోనా సమయంలో సీఎం వైయస్ జగన్ రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచి, మనోధైర్యం ఇచ్చారని తెలిపారు. ఇలాంటి కష్టకాలంలో చంద్రబాబు పత్తా లేకుండా పారిపోయారని విమర్శించారు. ప్రపంచాన్ని 9 నెలలుగా గడగడలాడించిన కోవిడ్‌ను మన రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని చెప్పారు. దేశంలోనే ఏపీలో అత్యధికంగా కోటికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో కరోనా నివారణకు చర్యలు చేపట్టారన్నారు. ఇలాంటి కష్ట సమయంలో పత్తా లేకుండా హైదరాబాద్‌కు పారిపోయారన్నారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రిట్‌మెంట్ ఈ మూడు విధానాలతో కరోనాను ఎదుర్కొన్నామని చెప్పారు. కోవిడ్‌కు సంబంధించి వైరస్ నివారణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన కరోనా నివారణ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇచచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ పోరాటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో ఆళ్ల నాని ఇంకా ఏమన్నారంటే..
- కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు పత్తా లేకుండా పోయారు
- ప్రజలకు మనోధైర్యం చెప్పాల్సిన సమయంలో ముఖం చాటేశారు
- నిపుణుల సూచనల మేరకు బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తే..చంద్రబాబు వెకిలిగా మాట్లాడారు
- ఈ రోజు అదే బ్లీచింగ్ పౌడర్‌తో కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్నాం
- జ్వరం వస్తే పారసెటమల్ కాకుండా చంద్రబాబు మరేదైనా వాడుతున్నారా?
- కరోనా నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ అమలు చేశాం
- గ్రామ స్థాయి వరకు కరోనా నిర్ధారణ పరీక్షలను విస్తరించాం
- కోటికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశాం
- కరోనా కట్టడికి ప్రజల భాగస్వామ్యం అవసరం
- కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చినా పంపిణీకి యంత్రాంగం సిద్ధం
- కరోనా సమయంలో పేద కుటుంబాలకు రూ.2000 చొప్పున అందజేశాం
- ఒక నెల రేషన్ ముందే ఇచ్చాం, రేషన్ పెంచి ఉచితంగా అందజేస్తున్నాం
- నిత్యావసర వస్తువులు ప్రతి ఇంటికి వాలంటీర్ ద్వారా అందజేశాం
- కూరగాయాల కోసంప్రత్యేకంగా రైతు బజార్లు వికేంద్రీకరించాం. మార్కెట్లు ఏర్పాటు చేశాం
- నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్‌లో అమ్మకూడదని ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏరపాటు చేశాం
- దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాం.
- రోగులకు బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నాం
- పరిశుభ్రమైన తాగునీరు, ప్రత్యేక శానిటైజేషన్ కార్యక్రమాలు చేపట్టాం
- 108 వాహనాలు 412, 104 వాహనాలు మండలానికి ఒకటి చొప్పున 650 కొత్త వాహనాలు కొనుగోలు చేశాం
- కోవిడ్ అంబులెన్స్‌లుగా 108,104 వాహనలు ఉపయోగపడ్డాయి
- 150 కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం..1519 చోట్ల శాంఫిల్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశాం
- రాష్ట్రంలో 243 కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేశాం