మూడుచక్రముల మోటరైజ్డ్ వాహనాల‌ పంపిణీ 

100 శాతం సబ్సిడీతో పూర్తిగా ఉచితంగా వాహనాలు పంపిణీ చేసిన మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు

శ్రీ‌కాకుళం:  ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా సరఫరా కాబడుచున్న రిట్రోఫిటెడ్ మూడుచక్రముల మోటరైజ్డ్ వాహనములు ( స్కూటీలు) ఈరోజు పలాస ప్రగతి భవన్ ప్రాంగణంలో రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమ మరియు మత్స్యశాఖమాత్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. పలాస నియోజకవర్గానికి సంబందించిన రూ .12.00 లక్షల విలువ గల 10 రిట్రోఫిటెడ్ మూడు చక్రముల మోటరైజ్డ్ వాహనములను 10 మంది అర్హతగల శారీరక దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ వాహనం తీసుకున్న లబ్ధిదారులు చాలా ఆనందంగా వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ఆశీస్సులతో రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు మంచి వాహనాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మూడు వేల రూపాయలు పింఛను ప్రతీ నెల ఒకటో తారీఖున ఇంటికి తీసుకొని వచ్చే గొప్ప ప్రభుత్వం వైయస్ఆర్‌ కాంగ్రెసు పార్టీ అని, ఈసందర్భంగా మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజుకి కూడా ధన్యవాదాలు తెలిపారు. 

Back to Top