సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

అనంత‌పురం:  కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా 14 మంది లబ్ధిదారులకు రూ. 5,90,000/- విలువ చేసే చెక్కులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులను కే.వి.ఉషాశ్రీచరణ్ పంపిణీ చేశారు. కష్టకాలంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నార‌ని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు.
 

తాజా వీడియోలు

Back to Top