మ‌హిళా సాధికార‌తే ప్ర‌ధాన ధ్యేయం 

వైయ‌స్ఆర్ వారోత్స‌వాల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాదరావు.

శ్రీ‌కాకుళం:  మ‌హిళా సాధికార‌తే ప్ర‌ధాన ధ్యేయం అని రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం,ర‌ణ‌స్థ‌లం మండ‌ల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్స్ లో వైయ‌స్ఆర్‌ ఆస‌రా ప‌థ‌క ల‌బ్ధిదారుల‌తో  బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్ర‌కారం ప‌థ‌కాల అమ‌లును సాధ్యం చేస్తున్నాం. ముఖ్యంగా ఇంటి గౌర‌వాన్ని పెంచే, ఇంటికి ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ ఇచ్చే ఇల్లాలికి అండగా ఉండేందుకు ప‌లు ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ ఉన్నాం. 

ఆ రోజు పాద‌యాత్ర‌లో భాగంగా డ్వాక్రా సంఘాల రుణాలు చెల్లించేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి విప‌క్ష నేత హోదాలో మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్ప‌టికే మూడు విడ‌తలు చెల్లించాం. ఇంకా ఒక్క విడ‌త మాత్ర‌మే చెల్లించాల్సి ఉంది. ఇవాళ ఇన్ని ప‌థ‌కాలు స‌మ‌ర్థ రీతిలో,మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా అమ‌లు అవుతున్నాయంటే అందుకు కార‌ణం మీరు. 2019 లో ఓటు వేసి అధికారం ఇవ్వడం వల్లనే సీఎం జగన్ చేయగల్గుతున్నారు. 

ఇచ్చే అధికారం మీ దగ్గరే ఉంది, మళ్ళీ ఆ అధికారం మీరు అందరూ మాకు ఇవ్వాలని కోరుతున్నాము. మేలు చేసే ప్ర‌భుత్వానికి మ‌ద్దతుగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను.. 2014కు ముందు, మీకున్న అప్పులన్నీ తనకి ఓటు వేస్తే చెల్లిస్తామ‌ని ఓ పెద్ద మ‌నిషి చెప్పారు. మహిళా సంఘాలు చేసిన అప్పులు, రైతాంగం చేసిన అప్పులు తీర్చేస్తా అని చంద్రబాబు నమ్మబ‌లికారు. కానీ తాను అధికారంలోకి వచ్చాక,ఇష్టాను సారంగా డబ్బు దుబారా చేసి తనవారికి,త‌న అనుకున్న వారికి పప్పు,బెల్లంలా పంచి పెట్టారు. ఇచ్చిన మాట మాత్రం నిల‌బెట్టుకోలేక‌పోయారు. జగన్ పాదయాత్ర చేస్తున్న సంద‌ర్భంలో మీ సంఘాలు అన్నీ ఆయ‌న్ను కలిశాయి. ఆ సంద‌ర్భంగా డ్వాక్రా రుణాలు 4 విడతల్లో చెల్లిస్తాం  అని జగన్ చెప్పారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ఇప్పటికే మూడు విడత‌లుగా రుణాల చెల్లింపు అన్న‌ది బ్యాంకుల‌కు చేసేశాం. మీ మీద ఒత్తిడి తీసుకు రాకుండా సీఎం జగన్ బ్యాంకర్స్ తో మాట్లాడారు. లేకపోతే ఇతర పథకాల పేరుతో వ‌చ్చే డ‌బ్బులు అన్నీ బ్యాంకర్స్ తీసుకునే వారు. ఆ రోజు అంటే 2014లో తాళం చంద్రబాబు కి ఇస్తే అందరినీ మోసం చేశారు.2019 లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి కి తాళం ఇస్తే చెప్పినవే కాకుండా,చెప్పనవి కూడా అమలు చేసి అండగా ఉంటున్నారు. మీరు ఈ తేడాను గ‌మ‌నించాలి. మీ అందరినీ శక్తి వంతులుగా చేస్తున్న ఈ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిల‌వాలి. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ఆశ‌లు అన్నీ మీ పైనే. నా అక్క చెల్లెమ్మ‌లంతా నాకు అండ‌గా ఉంటార‌ని ఆయ‌న విశ్వ‌సిస్తున్నారు. ఆయ‌న న‌మ్మ‌కాన్ని మీరు నిల‌బెట్టాలి.

దుర్మార్గంగా,అన్యాయంగా పథకాల తో సఫా చేస్తున్నాడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి అని చంద్రబాబు అంటున్నారు. అంటే మీకు ఇస్తున్న పథకాలు వృథా అని ఆయన ఉద్దేశం. కానీ ఇవాళ ముఖ్య‌మంత్రి ఆలోచ‌న ప్ర‌కారం ప్ర‌తి ఒక్క అర్హుడికీ ప‌థ‌కాలు అందించేలా చేయ‌డ‌మే ధ్యేయం. అందుకు జెండా చూడొద్దు. ఓటు వేశారో లేదో చూడొద్దు. ఇంటి మీద మా పార్టీ జెండా కట్టారో లేదో చూడొద్దు. రేపు మాకు ఓటు వేస్తారో లేదో చూడడం లేదు, అర్హుల‌యిన ల‌బ్ధిదారుల కళ్ళలో సంతోషం చూడాలి. కడుపు నింపి ఆనందం చూడాలి. సమాజంలో సంతోషంగా జీవించాలి ఇదే మా పార్టీ సిద్ధాంతం. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ఆచ‌రించి చూపిస్తున్న విధానం. 

మీ పిల్లలు ధనవంతులు పిల్లలు మాదిరిగానే చ‌దువుకునే విధంగా అందుకు త‌గ్గ సౌకర్యాలు అన్నీ అందే విధంగా చేస్తున్నాం. అమ్మ ఒడి పేరిట ప్ర‌తి త‌ల్లి ఖాతాకు ప‌దిహేను వేలు రూపాయ‌లు జ‌మ చేస్తున్నాం. నాడు నేడు పేరిట పాఠ‌శాల‌ల ఆధునికీక‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇచ్చాం. గ‌తంలో క‌న్నా ఇప్పుడు పాల‌న మీ చెంత‌కే తీసుకువ‌చ్చే విధంగా గ్రామ స‌చివాల‌యాలను ఏర్పాటు చేసి, అందుకు త‌గ్గ సిబ్బందిని నియ‌మించాం. అలానే మ‌ధ్యవ‌ర్తుల ప్ర‌మేయం అన్న‌ది లేకుండా ప‌థ‌కాల వ‌ర్తింపున‌కు కృషి చేస్తున్నాం. 

త‌న తండ్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాదిరిగానే రాజ‌కీయాల్లో రాణించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. త‌న తండ్రి మాదిరిగానే త‌న‌కూ పేరు రావాల‌ని భావిస్తున్నారు. అందుకే విద్య,వైద్య రంగాల‌కు ఉన్న‌త ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌కు బెల్ట్, బుక్స్, యూనిఫాం అందిస్తున్నారు.  అదేవిధంగా జ‌గ‌న‌న్న గోరు ముద్ద పేరిట మంచి ఆహారం అందిస్తున్నారు. ఈ మెనూను సీఎం నే స్వయంగా పరిశీలిస్తున్నారు. ధనవంతుల పిల్లలు లానే సరి సమానంగా పేద వాడి పిల్లలను చదివించాలి అని తపన పడుతున్నారు. పేదరికం వారి పిల్లల చ‌దువులు అడ్డు కాకూడదు భావిస్తూ అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తూ ఉన్నారు.

ఆడవారి పట్ల వివక్ష లేని సమాజం స్థాపించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇవాళ రూ.2750 పెన్షన్ అందిస్తున్నాము. అవ్వతాత లు ఎవ్వరూ మీద ఆధార పడకుండా జీవించేందుకు ఊతం ఇస్తున్నాం. వీటిని కూడా మీరు గుర్తించాలి. ఇక నిత్యావరాలు పెరిగాయి అంటూ టీడీపి వాళ్ళు మీ దగ్గరకు వేస్తే, దేశంలో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కన్నా తక్కువగా లభిస్తున్నాయో చెప్పమని అడగండి అక్క‌డికే వెళ్లి కొనుగోలు చేసి వ‌ద్దాం. ధ‌ర‌లు అన్న‌వి కేంద్ర పరిధిలో ఉండే అంశాలు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఈ విష‌యాల‌న్నింటినీ మీరు గ్ర‌హించాలి. ఈ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిలిచి మ‌ళ్లీ అధికారం అందించే అధికారం మీదే ! అని పేర్కొంటూ ధ‌ర్మాన త‌న ప్ర‌సంగం ముగించారు.

విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ..నవరత్నాల పేరిట ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ అండగా ఉంటున్న ప్రభుత్వం వైఎస్సార్సీపీది. అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్నాము.  ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గానికి ఆసరా క్రింద మూడో విడతగా 59 కోట్లు అందిస్తున్నాము..అని అన్నారాయన. 

ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిర‌ణ్ మాట్లాడుతూ..పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజల వద్దకే పాలన తీసుకు వచ్చిన ఘనత సీఎం జగన్ ది..పేద ప్రజల కోసం సీఎం జగన్ ఎంతవరకైనా వెళ్తారు..ప్రతిప‌క్ష పార్టీలు చేస్తున్న విమర్శ‌లు పట్టించుకోవద్దు. ప్ర‌భుత్వ విధానాలు విమ‌ర్శిస్తూ..విప‌క్ష నాయ‌కులు లోకేష్ పాద‌యాత్ర చేస్తున్నారు. కానీ సొంతంగా ఒక్క పథ‌కము అయినా ఇవ్వ‌గ‌ల‌నా అని చెప్పగలరా ? తోడేళ్ళ(టీడీపి, జనసేన) గుంపును సీఎం జగన్ ఎదుర్కోవ‌డానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు..ఒక లక్ష 65 వేల శాశ్వత ఉద్యోగాలు తీసిన ఘనత సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ది..వైజాగ్ రాజధాని అవ్వబోతుంది.. మనకి 60 కిలోమీటర్లలో రాబోతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం టీడీపీనాయకులకు ఇష్టం లేదు..అందుకే వారంతా విశాఖ కేంద్రంగా రాజ‌ధాని ఏర్పాటుకు వ్య‌తిరేకంగా ఉన్నారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఇవాళ అవినీతి లేని పాలన అందిస్తున్నాం..అలానే మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా ప‌థ‌కాలు అందిస్తున్నాం అని మంత్రి చెప్పారు.
కార్య‌క్ర‌మంలో పిడిడిఅర్డిఎ విద్యాసాగర్, రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు పెరాడ తిలక్, మామిడి శ్రీకాంత్,  జెడ్పీటీసీ సీతారాం, ఎంపిపి రజనీ సాయి కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మెంటాడ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top