వంగ‌పండు మ‌ర‌ణం బాధ క‌లిగిస్తోంది

డిప్యూటీ సీఎం పుష్ప‌శ్రీ‌వాణి

అమ‌రావ‌తి: ప‌్ర‌జా క‌వి వ‌ంగ‌పండు ప్ర‌సాద‌రావు మ‌ర‌ణం మ‌న‌సుకు చాలా బాధ క‌లిగిస్తోంద‌ని డిప్యూటీ సీఎం పుష్ప‌శ్రీ‌వాణి అన్నారు. ఆయ‌న మ‌ర‌ణం ఉత్త‌రాంధ్ర‌కు తీరనిలోటన్నారు. డిప్యూటీ సీఎం పుష్ప‌శ్రీ‌వాణి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్త‌రాంధ్ర జాన‌ప‌దాన్ని ప్ర‌పంచ‌స్థాయికి తీసుకెళ్లిన మ‌హోన్న‌త‌మైన వ్య‌క్తి వంగ‌పండు అని కొనియాడారు. ఆయ‌న పాట‌లు, ర‌చ‌న‌లు, ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చారని గుర్తుచేశారు. ఐదు ద‌శాబ్దాలుగా ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను వినిపించిన గొప్ప వ్య‌క్తి అని,  వంగ‌పండు ఉత్త‌రాంధ్ర వాసి అయినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాన‌న్నారు.

తాజా వీడియోలు

Back to Top