ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు ఒక్కడే

డిప్యూటీ సిఎం, మైనార్టీ శాఖ మంత్రి  ఎస్బీ అంజాద్‌ బాషా 

ముస్లిం మైనార్టీలకు కీడు చేసిన నిన్ను నమ్మం బాబూ..

మైనార్టీలను చంద్రబాబు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశాడు
 
మైనార్టీలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న వ్యక్తి వైయ‌స్ జగన్‌
 
చేయిపట్టుకు నడిపిస్తున్న జగన్‌గారి వెంటే మైనార్టీలు
 
మైనార్టీలు ఎప్పటికీ నిన్ను నమ్మరు బాబు: డిప్యూటీ సిఎం  ఎస్బీ అంజాద్‌ బాషా

 నీ 14 ఏళ్ల పాలనలో మైనార్టీలకు కార్యాచరణ ఏమైంది..?
 
తన స్వార్ధం కోసం ఎవరి గొంతైనా కోయగల వ్యక్తి చంద్రబాబు: డిప్యూటీ సిఎం  ఎస్బీ అంజాద్‌ బాషా

 హిందూపురంలో బావమరిది కోసం మైనార్టీనే పక్కనపెట్టాడు
 
రాజకీయాలకు చంద్రబాబే పూర్తిగా అనర్హుడు
 
వైయ‌స్ జగన్‌ గారి అర్హత గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది
 
మైనార్టీల రాజ్యాధికారం కల జగన్‌ గారి సారథ్యంలో నెరవేరుతోంది
 
వైయ‌స్ఆర్‌ పెట్టిన దుల్హన్‌ పథకాన్నీ తన ఖాతాలో వేసుకున్న బాబు
 
మా ప్రభుత్వంలో ప్రతి నెలా సంక్షేమ పడుగే..ప్రతి నెలా తోఫాలే

  తాడేప‌ల్లి: ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు ఒక్కడే అని డిప్యూటీ సిఎం, మైనార్టీ శాఖ మంత్రి  ఎస్బీ అంజాద్‌ బాషా విమ‌ర్శించారు. అంజాద్ బాషా మీడియాతో మాట్లాడారు. ఆయ‌న ఏమ‌న్నారంటే.. 

- ధరణికోటలో చంద్రబాబు మైనార్టీలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నడూ లేని ప్రేమ ఒలకబోస్తున్నాడు
- చంద్రబాబు ఒక ఊసరవెల్లి..అవసరం ఉన్నప్పుడు రంగులు మార్చే వ్యక్తి
- మళ్లీ గద్దెనెక్కాలంటే ఖచ్చితంగా మైనార్టీల ఓట్లు అవసరమని ఇప్పుడు చంద్రబాబు గ్రహించాడు
- అందుకే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ వల్లమాలిన ప్రేమను చూపిస్తున్నారు
- దీన్ని రాష్ట్రంలోని ప్రతి ముస్లిం మైనార్టీ సోదరులు గమనించాలి
- జగన్‌ గారు అన్నీ అబద్దాలే చెప్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు
- మహానేత డాక్టర్ వైయ‌స్సార్‌ శాసనసభ సాక్షిగానే చంద్రబాబు నిజం మాట్లాడితే ఆయన తల వెయ్యి వక్కలవుతుందని చెప్పారు
- అలాంటి వ్యక్తి వైయ‌స్ జగన్‌గారి గురించి మాట్లాడే అర్హత లేదు
- మైనార్టీలను ఎక్కువ న్యాయం చేసిన పార్టీ టీడీపీ అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది

నీ 14 ఏళ్ల పాలనలో కార్యాచరణ ఏమైంది..?:
- ఇన్నాళ్లకు మైనార్టీల కోసం కార్యాచరణ రూపొందిస్తాను అంటున్నాడు
- 2024లో తాను అధికారంలోకి వస్తే కానీ మైనార్టీలకు మేలు చేస్తాను అంటున్నాడు
- తన 14 ఏళ్లలో చంద్రబాబుకు మైనార్టీలు గుర్తుకురాలేదా..?
- అప్పుడు ఆయన మైనార్టీల కోసం కార్యాచరణ ఎందుకు రూపొందించలేదు..?
- ఇప్పుడొచ్చి కార్యాచరణ అంటే ముస్లిం మైనార్టీలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు
- నువ్వు చెప్పే అబద్దపు మాటలు వినడానికి ఎవరూ చెవిలో పూలు పెట్టుకుని లేరు
- నిన్ను విశ్వసించాలంటే నీ గత చరిత్రను కూడా తెలుసుకోవాలి..రాష్ట్రంలోని మైనార్టీలందరికీ నీ చరిత్ర అంతా తెలుసు
- నీకు ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుంటావు
- నువ్వు ఒంటరిగా పోటీ చేసి ఏనాడూ ముఖ్యమంత్రివి కాలేదు
- మామకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు
- ఆ తర్వాత ఆయన ఒంటరిగా ఏనాడూ పోటీ చేయలేదు
- నీతో జతకట్టిన వారిని కూడా వెన్నుపోటు పొడవడానికి కూడా వెనుకాడని వ్యక్తి చంద్రబాబు

బీజేపీతో జతకట్టను అన్న మాట 2014లో ఏమైంది బాబూ..:
- 1999లో పార్టీ బీజేపీతో జతకట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు.
- ఆనాడు మైనార్టీల మనోభావాలు చంద్రబాబుకు గుర్తుకురాలేదు
- చంద్రబాబు తన అధికార దాహం తీర్చుకునేందుకు మైనార్టీలనే కాదు..ఎవర్నైనా వెన్నుపోటు పొడవగలడు
- ఎందాకైనా వెళ్లి ఎంత నీచరాజకీయానికైనా ఒడిగట్టగల సమర్ధుడు
- ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక చట్టాలు తెస్తానంటున్నాడు.
- ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాలు ఎందుకు తీసుకురాలేకపోయాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి
- ఇప్పుడు కొత్తగా మైనార్టీలకు హామీలు ఇస్తున్నాడు..మైనార్టీలు ఎవరూ చంద్రబాబును నమ్మవద్దు
- చంద్రబాబు తన స్వార్ధం కోసం ఎవరి గొంతైనా కోయగల వ్యక్తి చంద్రబాబు
- 2004లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబుకు కనువిప్పు కలిగిందన్నాడు
- 2009లో మళ్లీ మైనార్టీలతో సమావేశం పెట్టి చారిత్రాత్మక తప్పిదం చేశాను..బీజేపీతో జతకట్టను..నన్ను క్షమించండి అన్నాడు
- రాబోయే రోజుల్లో ఆ తప్పును పునరావృతం చేయనని చెంపలేసుకున్నాడు
- క్షమాపణ కోరిన చంద్రబాబు మళ్లీ 2014లో అదే మతతత్వ పార్టీ బీజేపీతో జత కట్టి అధికారంలోకి వచ్చాడు
- ఇలాంటి రంగులు, మాటలు మార్చే వ్యక్తి దేశంలో చంద్రబాబు ఒక్కడే
- ఊసరివెల్లికి కొన్ని రంగులే ఉంటాయేమో కానీ..సమయం, సందర్భాన్ని బట్టి చంద్రబాబు ఏ రంగైనా మార్చగలడు
- అలా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మైనార్టీ సామాజికవర్గాన్ని అణగదొక్కాడు

హిందూపురంలో బావమరిది కోసం మైనార్టీనే పక్కనపెట్టాడు:
- చంద్రబాబు వ్యక్తిత్వం, జగన్‌గారి వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలి
- 2014లో హిందూపురం సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్ధుల్‌ ఘని ఉన్నాడు.
- అలాంటి ఎమ్మెల్యేని తన సొంత బావమరిది బాలకృష్ణ కోసం సీటు ఇవ్వకుండా పక్కన పెట్టేశాడు
- కడప సీటు తన సొంత మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి కావాలని అడిగినా జగన్‌ గారు ఇవ్వలేదు
- కడప మైనార్టీల సీటు..నేను జీవించినంత కాలం అది మైనార్టీలకేనని, సొంత మేనమామను కూడా పక్కన పెట్టిన వ్యక్తి జగన్‌ గారు

అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమం:
- రాజకీయాలకు చంద్రబాబే పూర్తిగా అనర్హుడు
- ఆయన జగన్‌ గారి రాజకీయ అర్హత గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది
- సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి, రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలను మోసం చేసిన చంద్రబాబు రాజకీయాలకు ఏ మాత్రం అర్హుడు కాదు
- మా నాయకుడు ప్రాంతాలు, వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు
- అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న వ్యక్తి శ్రీ వైఎస్‌ జగన్‌
- అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తున్నారు
- వారి రాష్ట్రాల్లో మన విన్నూత్న విధానాలు, పథకాలను అమలు చేసుకోవాలని ఆలోచనలు చేస్తున్నారు
- నీ ఫ్రస్టేషన్‌ లెవెల్‌ ఏ స్థాయికి చేరిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు

మైనార్టీల రాజ్యాధికారం కల ఇప్పుడు నెరవేరుతోంది:
- దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో జగన్‌ గారి నాయకత్వంలో  మైనార్టీలకు మేలు జరుగుతోంది.
- ఒక సామాజికవర్గం ఎదగాలంటే, అభివృద్ధి వైపు దూసుకెళ్లాలంటే కచ్చితంగా వారికి రాజకీయ ప్రాధాన్యం కల్పించాల్సి ఉంది
- అనేక దశాబ్ధాలుగా మైనార్టీల కల కూడా అదే.
- ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి..ఎందరో ముఖ్యమంత్రులు వచ్చినా మా కల నెరవేరలేదు
- ఒక్క మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ మాత్రమే మైనార్టీలకు పెద్ద పీట వేశారు
- మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్, ఫీజ్‌ రీఎంబర్స్‌మెంట్, దుల్హన్‌ వంటి పథకాలను కూడా ప్రవేశపెట్టారు
- దుల్హన్‌ పథకాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెడితే దాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడు
- ఈ ప్రభుత్వంలో వైయ‌స్ జగన్‌ గారు ఇచ్చిన మాట ప్రకారం షాదీతోఫా కింద మైనార్టీలకు లక్ష రూపాయలు ఇస్తున్నారు.

రాష్ట్రంలో ప్రతి నెలా సంక్షేమ పండుగే:
- రంజాన్, సంక్రాంతి తోఫా అనేవి పేదలకు మేలు చేయాలని చంద్రబాబు ప్రారంభించిన పథకాలు కావు
- తన సొంత లాభం కోసం, హెరిటేజ్‌లో వస్తువులను అమ్ముకోవడం కోసం బూజుపట్టిన బెల్లం, నాణ్యతలేని పప్పు ఇచ్చి చంద్రబాబు సొమ్ము చేసుకున్నాడు
- ఆ బూజుపట్టిన వస్తువులు ఇచ్చి ముస్లిం సోదరులకు గొప్ప మేలు చేసినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడు
- మా ప్రభుత్వం ప్రతి పేదవాడని ఆదుకోవాలని నవరత్నాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నాం
- పండుగలు ఏటా రెండో మూడో వస్తాయి..కానీ మా పథకాల ద్వారా ప్రతి నెలా ఒక పండుగ వస్తోంది
- వైఎస్సార్‌ ఆసరా, అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలతో ప్రతి నెలా పేదలకు మేలు జరుగుతోంది.
- ఎక్కడా అవినీతికి, లంచాలకు తావులేకుండా అర్హత ఉంటే చాలు అందరికీ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మాది

మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశాడు:
- 2014లో ఒకే ఒక్క మైనార్టీకి సీటిచ్చి..అతను కూడా ఓడిపోయేలా చేశాడు
- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మంత్రివర్గంలో మైనార్టీలకు అవకాశం లేని ప్రభుత్వం ఒక్క చంద్రబాబు ప్రభుత్వమే
- యూపీలో బీజేపీకి చెందిన యోగీ ఆదిత్యనాథ్‌ కూడా మైనార్టీలకు టిక్కెట్‌ ఇవ్వకపోయినా...మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చాడు
- 2014లో మైనార్టీలు తనకు ఓటు వేయలేదని మాపై కక్షపూరితంగా వ్యవహరించాడు
- ఆ పార్టీలోని మైనార్టీ నాయకులకు అపాయింట్‌మెంటు కూడా ఇవ్వలేదు
- హిందూపురంలో అబ్దుల్‌ ఘనికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడు
- పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ జెండా మోసిన లాల్‌జాన్‌బాషా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టిన వ్యక్తి చంద్రబాబు
- నంద్యాలలో ఫరూక్‌ ని కూడా పక్కన పెట్టాడు. నంద్యాల ఉప ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబుకు మైనార్టీలు గుర్తుకు వచ్చారు
- మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశాడు
- నంద్యాలలో 60వేలకు పైగా మైనార్టీల ఓట్లు ఉండటంతో మొసలి కన్నీరు కార్చాడు
- అక్కడ గెలిచిన తర్వాత ఎన్నికలు నాలుగైదు నెలల ఉండగా మైనార్టీ నేతలకు పదవులు ఇచ్చాడు
- మా నాయకుడు వైఎస్‌ జగన్‌ గారు తాను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే మైనార్టీలకు పెద్ద పీట వేశాడు
- జగన్‌ గారు ఐదుగురు టిక్కెట్లు ఇస్తే నలుగురు గెలిచారు..ఇక్బాల్‌ ఓడిపోతే శాసనమండలిలో అవకాశం ఇచ్చారు
- మైనార్టీగా ఉన్న నన్ను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత జగన్‌ గారికే దక్కుతుంది
- శాసన మండలిలో నలుగురు మైనార్టీలకు అవకాశం కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా నలుగురికి అవకాశం లేదు
- మా సోదరి జఖియాఖానంకు డిప్యూటీ ఛైర్మన్‌ పదవి కూడా ఇచ్చి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు

సబ్‌ప్లాన్‌ రాష్ట్రంలో అమలవుతుందని కూడా తెలియదా చంంద్రబాబూ..?:
- ఇప్పుడు సబ్‌ ప్లాన్‌ తీసుకొస్తాను అని చంద్రబాబు దొంగ హామీలు ఇస్తున్నాడు
- ఇప్పటికే మన రాష్ట్రంలో జగన్‌ గారు మైనార్టీలకు సబ్‌ ప్లాన్‌ తీసుకొచ్చారన్న విషయం చంద్రబాబుకు తెలియదా..?
- ఉర్ధూ బాషను రెండో అధికార బాషగా చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది
- రాష్ట్ర విభజన తర్వాత ఉర్ధూ తన రెండో అధికార బాష హోదాను కోల్పోయింది
- ఈ నేపథ్యంలో తన ఐదేళ్లలో దానికి రెండో అధికార బాషగా మార్చడంలో చంద్రబాబు కనీస ఆలోచన కూడా చేయలేదు
- రాష్ట్ర వ్యాప్తంగా ఉర్ధూను రెండో బాషగా చేస్తూ శ్రీ వైఎస్‌ జగన్‌ గారు చట్టాన్ని చేశారు
- కేంద్రంతో మాట్లాడి హజ్‌ వెళ్లేవారు హైదరాబాద్‌ వెళ్లకుండానే రాష్ట్రంలో ఎంబార్కేషన్‌ పాయింట్‌ తీసుకొచ్చారు
- 2023 నుంచి విజయవాడ నుంచే హజ్‌ యాత్రకు గౌరవంగా పంపుతాం
- హాజీలందరికీ ఆర్ధిక సాయం అందిస్తున్న ప్రభుత్వం ఒక్క జగన్‌గారి ప్రభుత్వమే
- ప్రతి హాజీకి వారి ఆదాయపరిమితి ప్రకారం రూ.60 వేలు, రూ.30 వేల చొప్పున వారి ఖర్చుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది
- గత ఏడాది సుమారు రూ.5.5 కోట్లు హాజీలకు ఆర్ధిక సాయం అందించాం
- ఇమామ్, మౌజంలకు ప్రతి నెలా గ్రీన్‌ చానల్‌ ద్వారా రూ.10వేలు, రూ.5  వేల చొప్పున వారి ఖాతాలో జమ చేస్తున్నారు
- చంద్రబాబు ఇమామ్, మౌజంలకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.12.60 కోట్లు 
- మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా ఆ సొమ్మును చెల్లించాం
- అవసరం తీరిపోయాక కరివేపాకులా తీసేసే చంద్రబాబును నమ్మవద్దు
- విశ్వాసానికి మారు పేరు మైనార్టీలు..మేలు చేసిన వారి, కీడు చేసిన వారిని జీవిత కాలం గుర్తుకుపెట్టుకుంటారు
- కీడు చేసిన చంద్రబాబులాంటి వ్యక్తిని ముస్లిం సామాజిక వర్గం ఎన్నటికీ నమ్మదు...
- ఎన్ని కష్టాలు ఉన్నా మైనార్టీలను చేయిపట్టుకుని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారి వెంటే ఉంటుంది
- మైనార్టీలు ఎప్పటికీ నిన్ను నమ్మరు బాబూ...నమ్మరు.

Back to Top