వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దాడి వీరభద్రరావు

అనకాపల్లి పార్లమెంటు ఎన్నికల పరిశీలకునిగా రత్నాకరరావు

అనకాపల్లి : శాసనమండలి మాజీ ఫ్లోర్‌ లీడర్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు వైయ‌స్ఆర్‌సీపీలో సముచిత స్థానం దక్కింది. ఇటీవలే పార్టీలో చేరిన ఆయనను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపిం ది. ఆయన తనయుడు రత్నాకరరావును అనకాపల్లి పార్లమెంటు ఎన్నికల పరిశీలకునిగా నియమించారు. సీనియర్‌ రాజ కీయ వేత్తగా గుర్తింపు పొం దిన వీరభద్రరావు,  తనయు డు రత్నాకరరావు సేవలను పార్టీ వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. వీరభద్రరరావు, రత్నాకరరావులకు పార్టీలో సముచిత స్థానం కల్పించి కీలకమైన బాధ్యతలను అప్పగించడంపై  అనుచరులు, పార్టీ అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Back to Top