తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు పొడిగించేందుకు అనుమతిచ్చింది. సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని జూలై 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది.