మనూ బాకర్.. యావత్ భారతదేశాన్ని గర్వించేలా చేశారు

పారిస్‌ ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించ‌డం ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు
 

తాడేప‌ల్లి:  పారిస్‌ ఒలింపిక్స్ మ‌హిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మనూ బాకర్‌ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో మనూ 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలువడం ప‌ట్ల ఏపీ మాజీ  ముఖ్య‌మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. భారత్‌ తరఫున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా మనూ చరిత్ర సృష్టించింద‌ని, ఆమె యావత్ భారతదేశాన్ని గర్వించేలా చేశారంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

Back to Top