ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ నైజం

సీఎం వైయస్‌ జగన్‌ వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. సీఎం జన్మదిన వేడుకల్లో భాగంగా పార్టీ ఆఫీస్‌ ఆవరణలో భారీ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీతో పాటు మహిళలకు కుట్టు మెషీన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండటం, ప్రజలకు సేవ చేయడంపైనే సీఎం వైయస్‌ జగన్‌ దృష్టిపెట్టారన్నారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ నైజమన్నారు. అధికారం అంటే బాధ్యత, సేవ చేసే అవకాశంగా సీఎం వైయస్‌ జగన్‌ భావిస్తున్నారన్నారు. పేదలు తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. పరిపాలన పగ్గాలు చేపట్టిన మూడున్నరేళ్లలోనే పల్లెల రూపురేఖలను మార్చారు. విద్య, వైద్యం ఇలా అనేక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ప్రజలను ధైర్యంగా ఓటు అడిగే హక్కు ఒక్క వైయస్‌ఆర్‌ సీపీకి మాత్రమే ఉందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ వందేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మ‌న్వ‌య‌క‌ర్త ప్ర‌తాప్‌రెడ్డి, ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు పాల్గొన్నారు. 

Back to Top