‘మీ అందరి చల్లని దీవెనలతోనే ఈ అఖండ విజయం’

‘పరిషత్‌’ ఫలితాలపై సీఎం వైయ‌స్ జగన్‌ ట్వీట్‌

తాడేప‌ల్లి: ‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలవల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది. మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం, ప్రతీ మనిషిపట్ల నా బాధ్యతను మరింత పెంచింది’.. అని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై  ఆదివారం సీఎం ట్వీట్‌ చేశారు. ‘సోమవారం ఉదయంలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి. అప్పుడు మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను’.. అని సీఎం అందులో పేర్కొన్నారు.   

Back to Top