శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం

తెలుగు ప్ర‌జ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ‌రామ న‌వ‌మి శుభాకాంక్ష‌లు  

తాడేప‌ల్లి:  శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జనరంజక పాలన సాగించిన గొప్ప ప్రజాపాలకుడు శ్రీరాముడు. ధర్మ సంస్థాపన, లోక కల్యాణం కోసం ఎన్నో కష్టాలకోర్చిన శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం. ఆ ఆదర్శ మూర్తుల చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్‌.

అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా ఈ పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అన్ని శుభాలు కలిగేలా శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభిలషించారు.

Back to Top