నేడు ‘వైయస్‌ఆర్‌ లా నేస్తం’ నిధులు విడుదల

కాసేపట్లో క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేయనున్న సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు వైయస్‌ఆర్‌ లా నేస్తం నిధులను విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి యువ లాయర్ల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. వరుసగా నాలుగో ఏడాది రాష్ట్రంలోని 2,011 మంది అర్హులైన జూనియర్‌ లాయర్ల బ్యాంక్‌ ఖాతాల్లో కోటి 55 వేల రూపాయలను సీఎం జమ చేయనున్నారు. నేడు విడుదల చేస్తున్న నిధులతో కలిపి ఇప్పటి వరకు 4,248 మంది న్యాయవాదులకు 35.40 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. 

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు యువ న్యాయవాదులను మరింతగా ప్రోత్సహించేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ‘వైయస్‌ఆర్‌ లా నేస్తం’ పథకాన్ని అమలు చేస్తోంది. కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన యువ లాయర్ల వృత్తిలో నిలదొక్కుకునేందుకు చేయూతగా మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.5 వేల చొప్పున సై్టఫండ్‌ అందిస్తోంది. ప్రతి జూనియర్‌ లాయర్‌కి మూడేళ్ల పాటు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. వరుసగా నాలుగో ఏడాది రాష్ట్రంలో 2,011 మంది జూనియర్‌ న్యాయవాదుల బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top