రేపు కౌలు రైతులకు రైతు భరోసా నిధులు జమ  

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కౌలు రైతులకు రైతు భరోసా అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయ‌స్ జగన్‌ బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్నారు. కౌలు రైతులతో పాటుగా దేవాదాయ భూమి సాగుదారులకు కూడా సాయం అందనుంది. 

ఏపీలో కౌలు రైతులకు పెద్దఎత్తున కౌలు కార్డులు జారీ చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సీసీఆర్‌సీ (క్రాప్‌ కల్టివేషన్‌ రైట్స్‌ కార్డ్స్‌) మేళాలు నిర్వహిస్తోంది. ఆర్బీకే స్థాయిలో మేళాలు నిర్వ­హించేలా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాయి. కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల­(పీఏసీ­ఎస్‌ల)ను ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీకేలతో అనుసంధానించింది. ప్రతి కౌలు రైతుకు రుణంతోపాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న భావనతో కౌలుదారులందరికీ పంట సాగు హక్కు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. 

తాజా వీడియోలు

Back to Top