ప్రతి కార్యకర్తకీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటా

పార్టీ క్యాడర్‌ని ఉద్దేశించి వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్ ట్వీట్

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప‌ని చేస్తున్న ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు ఎల్ల‌ప్పుడూ తోడుగా ఉంటాన‌ని పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు.  రాప్తాడులో నిర్వ‌హించిన సిద్ధం బ‌హిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేసిన కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

మన పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటా
అలానే ప్రజాసేవలో ఉన్న వారికి మరో రెండు మెట్లు పైకి ఎక్కే అవకాశం కల్పిస్తా
ఈ ఐదేళ్లు ప్రజలకు మంచి పాలన అందించాం
కాబట్టి, మనలో ఎవరు పోటీలో ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడతారు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.
 

Back to Top