కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న సీఎం వైయస్‌ జగన్‌ 

గుంటూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. గుంటూరు జిల్లా భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయానికి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌ అక్కడి కమ్యూనిటీ హాల్‌లో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 45 ఏళ్లు దాటిన పౌరులందరికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. సాధారణ పౌరుడి మాదిరిగానే రిజిస్ట్రేషన్‌ చేయించుకుని వ్యాక్సిన్‌ పొందారు. అనంతరం వైద్య సిబ్బంది అబ్జర్వేషన్‌లో ఉండి ఆ తరువాత సచివాలయం, వైద్య సిబ్బందితో సీఎం సమావేశం అవుతారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top