పశ్చిమ గోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పశ్చిమ గోదావరి జిల్లాలో గుడి నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్, ఆయన కుటుంబ సభ్యులు గుడి నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలాపురం మండలం రాజపాలెంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్, ఆయన కుటుంబ సభ్యులు, వైయస్ఆర్‌సీపీ నేతలతో కలిసి గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రజలకు సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్నసంక్షేమ పథకాలు ఈ ఆలయం రూపంలోచరిత్రలో నిలిచిపోతాయని ఎమ్మెల్యే వెంకట్రావ్ పేర్కొన్నారు.