ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం దిగ్భ్రాంతి

తాడేప‌ల్లి: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన దురదృష్టకరం అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 2 వంద‌ల మందికిపైగా చ‌నిపోవ‌డంపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సీఎం ఆదేశాల మేర‌కు సీఎంవో అధికారులు రైల్వే అధికారులతో మాట్లాడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్  ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాల‌కు మనస్థైర్యం ఇవ్వాలని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాన‌న్నారు. 

Back to Top