విశాఖ నగర అభివృద్ధిపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: విశాఖ అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తాగునీరు, రోడ్లు, పర్యాటక ప్రాజెక్టులపై చర్చించారు. విశాఖ మెట్రోపైనా సీఎం సమీక్షించారు. విశాఖలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులో సీఎం చర్చిస్తున్నారు. విశాఖను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రికి అధికారులు ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. హుద్‌హుద్‌ తుపాన్‌ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

Read Also: నేడు వైయస్‌ఆర్‌ ‘లా’ నేస్తం పథకం ప్రారంభం

తాజా ఫోటోలు

Back to Top