ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్కుల పనితీరు ఇందులో కీలకం

విలేజ్‌ క్లినిక్‌ స్ధాయిలో కంటి పరీక్షలు కూడా చేయాలన్న సీఎం

తాడేప‌ల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:

 • ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు: 
 • ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్‌ నంబర్‌ ప్రతిచోటా ఉంచాలి:
 • అలాగే సమర్థవంతమైన ఎస్‌ఓపీలను పెట్టాలి:
 • ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి:
 • పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్కుల పనితీరు ఇందులో కీలకం :
 • ప్రివెంటివ్‌ కేర్‌లో మనం ఆశించిన లక్ష్యాలను అప్పుడే సాధించగలం:
 • వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్‌ వ్యవస్ధ సమర్థవంతంగా పనిచేయాలి :
 • ఒక ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేయాలి:
 • ఎక్కడా కూడా సిబ్బంది కొరత అన్నది ఉండకూడదు:
 • 4 వారాలకు మించి.. ఎక్కడా ఏ ఖాళీ కూడా ఉండకూడదు: సీఎం.
 • సీఎం ఆదేశాలమేరకు కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చామన్న అధికారులు.
 • ఫస్ట్‌ఎయిడ్, స్నేక్‌ బైట్, ఐవీ ఇన్‌ఫ్యూజన్, ఇంజక్షన్, వూండ్‌ కేర్, డ్రస్సింగ్, బేసిక్‌ కార్డియాక్‌ లైఫ్‌ సపోర్ట్‌ లాంటి అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చామన్న అధికారులు.
 • అక్టోబరు22న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 1,39,97,189 మందికి సేవలు.
 • ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా సేవలందుకున్నవారిలో 35,79,569 మంది హైపర్‌ టెన్షన్‌తో, 24,31,934 డయాబెటిస్‌తో బాధపడతున్నట్టు గుర్తింపు.
 • వీరికి మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
 • పేషెంట్‌కు చికిత్స అందించడంతోపాటు.. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయాలన్న సీఎం. 
 • విలేజ్‌ క్లినిక్‌ స్ధాయిలో కంటి పరీక్షలు కూడా చేయాలన్న సీఎం.
 • క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయాలన్న ముఖ్యమంత్రి.
 • సికిల్‌ సెల్‌ ఎనీమియాను నివారించే కార్యక్రమంపై సీఎం సమీక్ష.
 • ఈ ఏడాది  6.68 లక్షలమందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపిన అధికారులు.
 • ఈ నెలలోనే అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించిన అధికారులు.
 • ఓరల్‌ హెల్త్‌లో భాగంగా సీఎం ఆదేశాల మేరకు ప్రతినెలా కూడా దంత వైద్యులు పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామన్న అధికారులు.
 • ఈ సమయంలో దంతసమస్యల చికిత్సకు  అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
 • టీబీ నివారణపైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వెల్లడించిన అధికారులు. 
 • ప్రస్తుతం లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయిస్తున్నామన్న అధికారులు.
 • అందరికీ పరీక్షలు చేయడంద్వారా బాధితులను గుర్తించి.. వారికి మంచి చికిత్స అందించే చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాలన్న సీఎం. 
 • ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గరనుంచి ప్రతి ఒక్కరికీ కూడా ఆరోగ్యశ్రీకార్డు ఇవ్వాలన్న సీఎం.
 • క్యూ ఆర్‌ కోడ్‌ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్యవివరాలను ఇందులో నమోదు చేయాలన్న సీఎం.
 •  

మెడికల్‌ కాలేజీలపైనా సీఎం సమీక్ష. 

 • ఈ విద్యాసంవత్సంలోనే ప్రారంభం కానున్న కొత్త మెడికల్‌ కాలేజీల్లో మౌలికసదుపాయాలపై సీఎం సమీక్ష.
 • మెడికల్‌ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
 • విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు.
 • పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్‌ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు.
 • మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు
Back to Top