నిధుల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి

40 రోజుల్లో ప్రాజెక్టులన్నీ నిండేలా చూడండి

పోలవరం, వెలిగొండ, వంశధార ప్రాజెక్టుల పనులపై ఆరా

ఇరిగేషన్‌ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: నిధుల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. సీఎం అధ్యక్షతన ఇరిగేషన్‌ శాఖపై చేపట్టిన సమీక్షా సమావేశం ముగిసింది. సమావేశంలో ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్ల నీటిమట్టం, ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. ప్రాంతాలు, ప్రాజెక్టులు, జిల్లాల వారీగా జరుగుతున్న పనులపై సీఎం వైయస్‌ జగన్‌కు నివేదిక అందజేశారు. పోలవరం, వెలిగొండ, వంశధార సహా ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనులపై సీఎం వైయస్‌ జగన్‌ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాల్వల సామర్ధ్యం, పెండింగ్‌ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద జలాలు వచ్చే 40 రోజుల్లో అన్ని ప్రాజెక్టులు నిండేలా చూడాలని ఆదేశించారు. దీనిపై ప్రతిపాదనలతో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

ప్రస్తుతం నడుస్తున్న, కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో విభజించి అంచనాలపై నివేదిక ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిధుల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రాధాన్యతల పరంగా ఖర్చు చేయాలి.. ఫలితాలు వచ్చేలా ఉండాలని సూచించారు. భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యల కారణంగా జలయజ్ఞం పనులు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని అధికారులు చెప్పగా.. మొదటి ప్రాధాన్యత దిశగా ముందుకు వెళ్లాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. 
 

Read Also: పరిహారం అందిస్తాం.. ఆందోళన చెందవద్దు

Back to Top