క్వారంటైన్‌ నుంచి ఇంటికి వెళ్లే ఒక్కో వ్యక్తికి రూ.2 వేలు

చార్జీల నిమిత్తం రూ. 600 చెల్లించాలి

కరోనా నియంత్రణ సమీక్షలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది. సమావేశంలో లాక్‌డౌన్‌ అమలు, రెండో విడత రేషన్‌ పంపిణీ, క్వారంటైన్‌, ఐసోలేషన్‌లలో సదుపాయాలు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారు. ఈ సందర్భంగా కరోనా బాధితులను ఆదుకునేందుకు సీఎం వైయస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్వారంటైన్‌ పూర్తిచేసుకొని ఇంటికి వెళ్లే వారికి ఒక్కొక్కరికి రూ. 2 వేలు ఆర్థికసాయం అందించాలని, ఇంటికి వెళ్లిన తరువాత పౌష్టికాహారం కోసం ఈ ఆర్థికసాయం ఉపయోగపడుతుందన్నారు. అంతేకాకుండా చార్జీల నిమిత్తం రూ.600 వారికి అందజేయాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ అందజేశారు. క్వారంటైన్‌ సమయంలో రోజుకు ఒక్కో వ్యక్తికి రూ. 600 వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి హాజరయ్యారు. 
 

Back to Top