ఈ కార్యక్రమాలతో కరువు ప్రాంతాలకు ఊరట

ప్రభుత్వ ప్రాధాన్యతలను అధికారులకు వివరించిన సీఎం వైయస్‌ జగన్‌
 

 

తాడేపల్లి: రాష్ట్ర అభివృద్ధి కోసం ముందడుగులు వేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల ప్రాధాన్యతలను అధికారులకు వివరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. నవరత్నాలు, నాడు – నేడు కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఏటా పేదలకు 6 లక్షల ఇళ్లు నిర్మించాలనేది రెండో ప్రాధాన్యత అని వివరించారు. రాయలసీమ ప్రాజెక్టుల కాల్వల విస్తరణ మూడో ప్రాధాన్యత. పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌.. అక్కడి నుంచి బనకచర్లకు గోదావరి జలాలు మరో ప్రాధాన్యత. ప్రతి జిల్లాకు తాగునీరు అందించాలన్న వాటర్‌ గ్రిడ్‌ మరో ప్రాధాన్యత అని వివరించారు. ఈ కార్యక్రమాల వల్ల కరువు ప్రాంతాలకు ఊరట లభిస్తుందన్నారు.  

Back to Top