‘ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళల పట్ల సత్ప్రవర్తన’ బుక్‌లెట్‌ ఆవిష్కరణ

సచివాలయం: ‘ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళల పట్ల సత్ప్రవర్తన’పై రాష్ట్ర పోలీస్‌ శాఖ రూపొందించిన బుక్‌లెట్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో స్టేట్‌ లెవల్‌ హైపవర్‌ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం అనంతరం బుక్‌లెట్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ ఆదిత్యనాధ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి కె సునీత, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌ రావత్, పలువులు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top