బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఘ‌న నివాళులు

తాడేప‌ల్లి:  స్వాతంత్య్ర సమర యోధుడు,  అభ్యుదయవాది, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా దేశానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి గుర్తు చేసుకున్నారు.  కార్య‌క్ర‌మంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ విప్‌ కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమార్, ప్రభుత్వ సామాజికన్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top