బాబూ జగ్జీవన్‌రామ్‌కు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

తాడేపల్లి: స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది, భార‌త మాజీ ఉప ప్ర‌ధాని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌ రామ్‌ 113వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘరామ్,  ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top