తాడేపల్లి: ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 6వ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ భేటీలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ పాల్గొని మాట్లాడారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, విభజనకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌లో ప్రకటించారని నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు. సమావేశంలో సీఎం వైయస్ జగన్‌తో పాటు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల్ వలవెన్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి విజయ్ కుమార్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండి నాగులాపల్లి శ్రీకాంత్, అగ్రికల్చర్ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.