అందుకే సీఎం వైయ‌స్ జగన్‌ జననేత అయ్యారు..!

 మచిలీపట్నం: కృష్ణా జిల్లా పెడనలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ఆసక్తికరమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. వైయ‌స్సార్‌ నేతన్న నేస్తం పథకం ప్రారంభోత్సవానికి హాజరైన అనారోగ్య బాధిత బాలుడి తల్లిదండ్రులు, ఓ వృద్ధురాలు, మరో ముగ్గురు మహిళలు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌కు తమ సమస్యలను విన్నవించేందుకు నిరీక్షిస్తున్నారు.

వేదికపై కూర్చున్న సీఎం వైయ‌స్ జగన్‌ అర్జీలు చేతబట్టుకుని ఎదురుచూస్తున్న వారిని గమనించి తనవద్దకు తీసుకురావాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా, జేసీ రావిలాల మహేష్‌కుమార్‌కు సూచించారు. కలెక్టర్‌ ఆదేశాలతో పోలీసులు వారందరినీ బారికేడ్లు దాటించి వేదిక వద్దకు తీసుకొచ్చారు. సీఎం కార్యాలయ కార్యదర్శి ముత్యాలరాజు, మాజీ మంత్రి పేర్ని నాని వారి వద్దకు వెళ్లి అర్జీలను స్వీకరించి సీఎంకు అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశించారు. కార్యక్రమం ముగిశాక గుర్తు పెట్టుకుని మరీ మరోసారి వారిని పిలిచి మాట్లాడారు. 

Back to Top