మాతృభాష మ‌న ఉనికి, మ‌న అస్తిత్వానికి ప్ర‌తీక‌

తెలుగువారంద‌రికీ మాతృభాషాదినోత్స‌వ శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తెలుగువారంద‌రికీ అంత‌ర్జాతీయ మాతృభాషా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు. `మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు` తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు.

Back to Top