కాసేప‌ట్లో రాష్ట్ర‌ప‌తితో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

న్యూఢిల్లీ: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న బిజీబిజీగా కొన‌సాగుతోంది. ప్ర‌ధాన‌మంత్రి మోడీతో భేటీ అయిన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు కీల‌క అంశాల‌పై ఆయ‌న‌తో చ‌ర్చించారు. మ‌రికాసేప‌ట్లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముతో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ భేటీ కానున్నారు. మ‌ధ్యాహ్నం 12:30 గంటలకు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ద్రౌపది ముర్మును సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుస్తారు. రాష్ట్ర‌ప‌తితో స‌మావేశం అనంత‌రం మధ్యాహ్నం కేంద్ర మంత్రి ఆర్‌.కే. సింగ్‌తో సీఎం వైయ‌స్‌ జగన్‌ భేటీ కానున్నారు. ఈ భేటీలో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ. 6వేల కోట్ల విద్యుత్‌ బకాయిలపై చర్చించే అవకాశం ఉంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top