8వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్‌

గురవరాజుపల్లె ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభం  

చిన్న సింగమల వద్ద 11 గంటలకు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో సీఎం ముఖాముఖి

నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారి పక్కన బహిరంగ సభ 

చింతరెడ్డిపాలెం సమీపంలో రాత్రి బస 

చిత్తూరు: సీఎం వైయ‌స్‌ జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 8వ రోజు గురువారం(ఏప్రిల్‌ 4) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. సీఎం జగన్‌ బుధవారం రాత్రి బస చేసిన గురవరాజుపల్లె దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. మల్లవరం, ఏర్పేడు, పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్‌ మీదుగా చిన్న సింగమల సమీపానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

అక్కడ ఉదయం 11 గంటలకు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖి­లో సీఎం పాల్గొంటారు. చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.  మధ్యాహ్నం 3.30 గంటలకు నాయుడుపేట సమీపంలోని చెన్నై జాతీయ రహదారి పక్కన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్‌ మీదుగా చింతరెడ్డిపాలెం వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. 

Back to Top