ప్రధానితో ముగిసిన సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

గంటన్నర పాటు ప్రధానితో పలు అంశాలపై చర్చించిన సీఎం

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భేటీ ముగిసింది. గంటన్నరకు పైగా సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానితో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీలు, పెండింగ్‌ బిల్లులతో పాటు వివిధ అంశాలపై ప్రధానితో సీఎం కూలంకుషంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, నందిగం సురేష్, శ్రీకృష్ణ దేవరాయలు, రెడ్డప్ప, దుర్గాప్రసాద్, చింతా అనురాధ, వంగా గీత, భీశెట్టి వెంకట సత్యవతి తదితరులు ఉన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top