తాడేపల్లి: భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు… వాటిని మరిచిపోయి… మునుపటిలా కలిసిమెలిసి జీవించాలి.అందరం కలిసికట్టుగా ఒక్కటవుదామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అమలాపురం ఘటనల కారణంగా సామాజిక విభేదాల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వివిధ సామాజిక వర్గాలు మధ్య శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని బలపరిచే దిశగా ముఖ్యమంత్రి చొరవ చూపారు. క్యాంపు కార్యాలయంలో కోనసీమ నేతలు, సామాజికవర్గాల నాయకులతో సీఎం సమావేశమయ్యారు. అమలాపురం ఘటనలో నమోదైన కేసులు ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కోనసీమ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే.. తరతరాలుగా మీరంతా అదే ప్రాంతంలో కలిసిమెలిసి జీవిస్తున్నారు: అక్కడే పుట్టిన.. అక్కడే పెరిగి… జీవిత చరమాంకం వరకూ అక్కడే ఉంటున్నారు: రేపు అయినా.. అక్కడే పుట్టాలి.. అక్కడే పెరగాలి.. అక్కడే జీవితాల్ని ముగించాలి: అందుకే భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు… వాటిని మరిచిపోయి… మునుపటిలా కలిసిమెలిసి జీవించాలి. లేకపోతే భవిష్యత్తు దెబ్బతింటుంది: దీన్ని ఇలా లాగుతూ పోతే.. మనుషుల మధ్య దూరం పెరుగుతుంది: దీనివల్ల నష్టపోయేది మనమే… అందుకే అందరం కలిసి ఉండాలి, ఆప్యాయతతో ఉండాలి: చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, అపోహలు ఉన్నా పక్కనపెట్టి ఆప్యాయంగా మాట్లాడుకుందాం, తప్పులు భూతద్దంలో చూసుకోకుండా ఒకరికొకరు కలిసిపోదాం: అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం, మిమల్ని ఒకటి చేయడం కోసం ఈ ప్రయత్నమంతా చేస్తున్నాం: అందరికీ పార్టీలు చూడకుండా శాచురేషన్ బేసిస్ మీద పథకాలు అన్నీ ఇస్తున్నాం: వలంటీర్‌లకు తోడుగా గృహ సారథులు కూడా ఉంటారు: వ్యవస్ధలో పారదర్శకంగా ఉండాలనే ఈ నిర్ణయం: అర్హత ఉన్న వారికి ఏ పథకమైనా అందని పరిస్థితి ఉండకూడదనేది మన విధానం: కులం చూడకుండా, మతం చూడకుండా ఎవరికి అర్హత ఉంటే వారికి అన్నీ ఇస్తున్నాం: పార్టీలు చూడకుండా జరగాల్సిన మంచి చేస్తున్నాం: రూ. 2 లక్షల కోట్ల డీబీటీ దేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదు: రూపాయి లంచం లేకుండా ఈ స్ధాయిలో ఎప్పుడూ జరగలేదు: టీడీపీ హాయంలో నా పాదయాత్రలో లోన్ ల గురించి ప్రస్తావన వచ్చింది: అప్పుడు లోన్ ల కోసం లంచం ఇవ్వాల్సిన పరిస్ధితి: అవికూడా అక్కడక్కడా అరకొర అందేవి: ఇప్పుడు ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తున్నాం: లంచాలు లేని ఇంత మంచి వ్యవస్ధను తీసుకొచ్చాం: మంచి చేసే విషయంలో ఏం చూడకుండా చేస్తున్నాం: ఇలాంటి వ్యవస్థ ఉంటేనే సమాజానికి మంచి జరుగుతుంది: ఏ కారణం చేతనైనా ఎవరైనా మిస్ అయితే వారిని చేయి పట్టుకుని నడిపించడానికి కార్పొరేషన్లు కూడా ఏర్పాటుచేశాం: ఇది మంచి పరిణామం, దేవుడి దయ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం: మీరంతా మనస్ఫూర్తిగా ముందుకు వచ్చారు. మంచి వాతావరణం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను: పినిపే విశ్వరూప్, పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. జరిగిన ఘటన దురదృష్టకరం, మేం ఊహించని ఘటన జరిగింది, భావోద్వేగాలతో జరిగింది. దీన్ని మేం వ్యక్తిగతంగా తీసుకోలేదు, కోనసీమలో మళ్ళీ గొడవలు రాకుండా మీరు తీసుకున్న చొరవకు మా ధన్యవాదాలు, మేం మనస్పూర్తిగా కేసులన్నీ ఉపసంహరించుకుంటున్నాం, మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు. అందరం సమన్వయంతో ముందుకెళదాం. ఈ సమావేశంలో మాట్లాడిన కాపు నాయకులు ఏమన్నారంటే .. జరిగిన ఘటనలు దురదృష్టకరం: ఇవి ఏమాత్రం మంచిది కాదు: సామరస్య వాతావరణం ఉండాలి: మేం పూర్తిగా సహకరిస్తాం: దీనికోసం ముఖ్యమంత్రిగారు చొరవ తీసుకోవడం హర్షణీయం: కేసులు అనేవి యువకుల భవిష్యత్తుకు మంచిదికాదు: వారు జీవితాలు దెబ్బతింటాయి: వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి కుటుంబాల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రిగారు చక్కగా స్పందిస్తున్నారు: అందుకే మా వైపు నుంచి పూర్తిగా సహకరిస్తాం: ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞులై ఉంటాం: శెట్టిబలిజ నాయకులు ఏమన్నారంటే: మా శెట్టిబలిజ, కాపు కమ్యూనిటీల నుంచి పూర్తి సహకారం ఉంటుంది: అమలాపురంలో జరిగిన ఘటన దురదృష్టకరం మా శెట్టిబలిజ కమ్యూనిటీకి మీరు చాలా సాయం చేశారు, మీరు పెద్ద మనసుతో కేసులు ఉపసంహరించి మాకు సాయం చేశారు మీకు మేం ఎప్పుడూ రుణపడి ఉంటాం, మేం కృతజ్ఞులుగా ఉంటాం ఏ సీఎం చేయలేనంతగా మీరు శెట్టి బలిజలకు పదవులు ఇచ్చారు అనేకమంది కాలేజీ పిల్లలకు కేసుల నుంచి విముక్తి కల్పిస్తున్నారు: కేసులన్నీ కూడా విత్‌డ్రా చేసి న్యాయం చేస్తున్నారు ధన్యవాదాలు అందరినీ కూర్చొబెట్టి పరిష్కరించినందుకు మీకు ధన్యవాదాలు మీరు చొరవ తీసుకుని మా సమస్యలు పరిష్కరిస్తున్నారు మీరు సమాజ శ్రేయస్సు కోసం నిర్ణయం తీసుకున్నారు, అందరం అన్నదమ్ముల్లా ఉండాలనడం సంతోషకరం, మీరు మా విషయంలో గొప్ప నిర్ణయం తీసుకున్నారు