పల్నాడు: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఆపద్భాంధవుడిగా ఉన్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా తనను కలిసిన వారిని ఆదుకుంటూ అండగా నిలుస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వరికపూడిశిల ఎత్తిపోతల పనుల 15/11/2023 న ప్రారంభం తదుపరి మాచర్లలో నిర్వహించిన బహిరంగ సభ అనంతరం హెలిప్యాడ్ వద్ద నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పలువురు ముఖ్యమంత్రిని కలసి సహాయం కోసం అర్జీలు సమర్పించుకోగా. అర్జీలపై తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టరు శివశంకర్ లోతేటిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ స్థానిక కలెక్టరేట్ లోని డా,బి.ఆర్ అంబేద్కర్ స్పందన హాలులో అర్జీదారుల సమస్యలు వ్యక్తిగతంగా పరిశీలించి వెంటనే ఆర్థిక సహాయం ప్రకటించి, చెక్కులు గురువారం (16/11/2023) పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ వారిచే ఆర్థిక సహాయం పొందిన వారి వివరాలు. 1. నూతలపాటి రాణి కుమార్తే ,(నవజాత శిశువు) రావి పాడు, నరసరాపేట, నవజాత శిశువు అనారోగ్య సమస్యల వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణమే లక్ష రూపాయల ఆర్ధిక సాయం. 2. వెంకట శివ పర్వీన్, తండ్రి ఆనంద్, నరసరావుపపేట బోన్ మారో ట్రాన్స్ప్ ప్లాంటేషన్ కై తక్షణమే లక్ష రూపాయల ఆర్ధిక సాయం. 3. డి.మోక్షిత గింజుపల్లి తాండా, తండ్రి చిరంజీవి, అచ్చంపేట్ క్లబ్ ఫుట్( కాళ్ళ వంకర) ఆపరేషన్ కై తక్షణమే లక్ష రూపాయల ఆర్ధిక సాయం. 4.టి.హెచ్.మోక్షజ్ఞ , తండ్రి హుస్సేన్ బాబు,బండ్లమోటు, బొల్లాపల్లి తలసేమియా వ్యాధి మరియు బోన్ మారో ట్రాన్స్ప్ ప్లాంటేషన్ కై తక్షణమే లక్ష రూపాయల ఆర్ధిక సాయం. 5. పి,నాగేశ్వర రెడ్డి, తండ్రి సుబ్బారెడ్డి, దొండపాడు, నరసరావుపేట కారోనరి సర్జరీ కై తక్షణమే లక్ష రూపాయల ఆర్ధిక సాయం. 6. బుసి ఎమాన్జిలియన్, తండ్రి మరియదాసు, బ్రాహ్మణపల్లి,పిడుగురాళ్ళ పలు వైద్య సమస్యల పరిష్కారానికై లక్ష రూపాయల ఆర్ధిక సాయం,నిరతర పర్యవేక్షణ. 7. బనవాత్ రమేష్ నాయక , తండ్రి బాల కోటి నాయక్ ,నీలేస్వర పాలెం ,అత్చంపెట కిడ్నీ సమస్య పరిష్కారానికై లక్ష రూపాయల ఆర్ధిక సాయం 8. రమేష్ బాబు, తండ్రి కొండలు,అంగలూరు,ఈపూరు, అనరోగ్య కారణంగా ముఖ్య మంత్రి సహాయనిధి నుండి ఆర్దిక సహాయంలో బాగంగా లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం. 9. ఎ.వెంకట శివ సాయి అక్షయ్, తండ్రి కోటేశ్వరరావు, తంగేడ,దాచేపల్లి, గుండె సంబందిత వ్యాది తో పుట్టినప్పటి నుండి బాధపడుతున్నందున వైద్యం కొరకు లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం. 10. బి.గుంజి ప్రసాద్, తంగేడ, దాచేపల్లి కన్జేన్షియల్ హృద్రోగ వ్యాది వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం. 11. మాచెర్ల నిస్సి ప్రియ, తండ్రి భరత్,రావిపాడు, నరసరాపేట ఎన్సిఫలైటిస్ వ్యాధితో బాదపడుతున్నందున వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణమే లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం. 12. వి. సాయి తేజ మరాతి, తండ్రి ఆంజనేయులు మాచెర్ల,బ్రెయిన్ ఆపరేషన్ కై తక్షణమే లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం. 13. శ్రీ రామనా దుర్గా రావు, క్రోసూరు, మానసిక మరియు మూర్చ వ్యాది నివారణకై ఆర్ధిక సాయంగా లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం. 14. కే.అంజి రెడ్డి,చింత గుంటపాలెం, పర్చూరు గత 3 సంవత్సరములనుండి టి.బి మరియు వెన్నుపూస బాధతో బాదపడుతున్నందున లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం. 15. సయ్యద్ జాస్మిన్, భర్త కరీముల్ల, అడిగొప్పుల, దుర్గి, తలసేమియా వ్యాది - లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం. 16. బత్తుల సౌమ్య, తండ్రి ఆనంద్, హనుమానగర్, వినుకొండ కిడ్నీ ఫెయిల్యూర్- లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం. 17. కొంతం రామలక్ష్మి శరణ్య, తండ్రి శ్రీనివాస్,మాచెర్ల,మూర్చ వ్యాది నివారణకై ముఖ్య మంత్రి సహాయ నిధిని నుండి ఆర్ధిక సాయం- లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం. 18. కటకం జయశ్రీ, దాచేపల్లి, బ్రెయిన్ డేడ్ భర్త వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం. 19. జే.వెంకట సూర్య గోపి చంద్, తండ్రి రామ కోటేశ్వర రావు, ఒప్పిచెర్ల, కారెంపూడి కండరాల వ్యాధి- వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం. 20.పి.రజని కుమారి, భర్త కిశోరే బాబు,రావిపాడు, నరసరావుపేట,బయో లాజికల్ ఇంజక్షన్ ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం.