అసెంబ్లీ: ‘‘అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు, టిడ్కోలో, చివరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిర్మించే పనుల్లో కూడా గత చంద్రబాబు పాలనలో దోపిడీ జరిగింది. సబ్ కాంట్రాక్ట్‌ల పేరుతో బోగస్ కంపెనీలకు నిధులు మళ్లించి మరీ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. చంద్రబాబు పాలనలో జరిగిన దోపిడీ ఇన్‌కంట్యాక్స్ రైడ్స్‌తో బయట పడిందని, అప్రైజల్ రిపోర్టులో షాపూర్‌జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్, చంద్రబాబు ఏపీ శ్రీనివాస్, రామోజీరావు కొడుకు వియ్యంకుడు రఘు, మరికొంతమంది కలిసి ఒక పద్ధతి ప్రకారం దొంగల ముఠాగా ఏర్పడి.. దోచుకో, పంచుకో, తినుకో అనే కార్యక్రమంలో భాగస్వాములై ఏరకంగా లూటీ చేశారో ఆధారాలతో సహా దొరికిపోయారన్నారు. ఇవన్నీ శాసనసభ ద్వారా ప్రజలందరికీ, ఎమ్మెల్యేలందరికీ తెలియాలని చెబుతున్నామని సీఎం వైయస్ జగన్ అన్నారు. ‘‘ఇన్‌కం ట్యాక్స్ వారు రైడ్స్ షాపూర్‌జీ–పల్లోంజి అనే కంపెనీకి సంబంధించిన ప్రతినిధి మనోజ్ అనే వ్యక్తి మీద రైడ్స్ చేశారు. మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తి మీద నవంబర్ 2019లో రైడ్స్ జరిగాయి. అక్కడి నుంచి సమాచారం అంతా ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్‌కు లభ్యమయ్యాయి. దాని తరువాత ఫిబ్రవరి 2020 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ మీద ఐటీ రైడ్స్ జరిగాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి మీద ఐటీ దాడుల తరువాత సమాచారం ఇంకాస్త ఎక్కువ సేకరించారు. ఇన్‌కంట్యాక్స్ డిపార్టుమెంట్ రైడ్స్ చేసిన తరువాత సమాచారం అంతా క్రోడీకరించిన తరువాత వీరు చెప్పిన సమాచారం మేరకు ఇన్‌కంట్యాక్స్ అప్రైజల్ రిపోర్టు అనేది ఇన్వెస్టిగేషన్ డివిజన్ చేస్తుంది. ఆధారాలను పరిశీలించి ఆ వ్యక్తులను పిలిపించి లభించిన ఆధారాలను చూపించి వారి స్టేట్‌మెంట్ ఇన్‌కంట్యాక్స్ డిపార్టుమెంట్ రికార్డ్స్ చేసుకుంటుంది. ఇన్‌కంట్యాక్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాత విచారణకు హాజరైనవారు సంతకాలు కూడా పెడతారు. ఇన్‌కంట్యాక్స్ అప్రైజల్ రిపోర్టు గురించి మంత్రి అమర్‌నాథ్ సభలో చాలా స్పష్టంగా చెప్పారు. మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు, మనోజ్ చూపించిన ఆధారాలకు అనుకూలంగా శ్రీనివాస్‌కు కూడా చూపించిన తరువాత అతను మాట్లాడిన మాటలు ఇవన్నీ చూసిన తరువాత ఫైనల్‌గా చంద్రబాబుకు కూడా ఇన్‌కంట్యాక్స్ వారు నోటీసులు పంపించారు. 2019 జనవరి, ఫిబ్రవరి నెలల్లో మనోజ్ అనే వ్యక్తిని చంద్రబాబు పిలిపించుకున్నాడు. మనోజ్ అనే వ్యక్తి షాపూర్‌జీ–పల్లోంజి అనే కంపెనీ ప్రతినిధి. తన పీఏ శ్రీనివాస్‌ను కలవండి అని చంద్రబాబు మనోజ్‌కు ఆదేశాలిచ్చాడు. బాబు ఆదేశాల మేరకు మనోజ్ అనే వ్యక్తి శ్రీనివాస్‌ను కలిశాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి (7వేల కోట్ల వర్కుల్లో 5శాతం) రూ.143 కోట్లను కలెక్ట్ చేసే విధంగా అడుగులు వేశారు. మనోజ్ అనే వ్యక్తి శ్రీనివాస్‌ను కలిసిన తరువాత వినయ్ నంగాలి, విక్కీ జైన్ అనే వ్యక్తిని మనోజ్ వాసుదేవ్‌కు అటాచ్ చేశారు. ఆ తరువాత వినయ్ మూడు కంపెనీలు, విక్కీ జైన్ అనే వ్యక్తి మరో రెండు కంపెనీలు మనోజ్‌కు అప్పగించి ఈ కంపెనీలకు సబ్ కాంట్రాక్ట్‌ల కింద డబ్బులు ఇవ్వండి, వీరు మాకు డబ్బులు ఇస్తారని చెప్పారు. వినయ్ అనే వ్యక్తి హైగ్రీవా, అనల్, షలాక అనే కంపెనీని అటాచ్ చేశారు. విక్కీ జైన్ వ్యక్తి నవోలినో, ఎవరెట్టో అనే కంపెనీలను అటాచ్ చేశారు. మనోజ్ అనే వ్యక్తికి వీరిద్దరు ఎవరో తెలియదు. షాపూర్‌జీ పల్లోంజి కంపెనీ ఇవ్వలేమని చెప్పినా కూడా ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించినట్టుగా మనోజ్ తన ఐటీ అప్రైజల్ రిపోర్టులో ఏకంగా స్టేట్‌మెంట్ ఇచ్చిన కాపీస్ చూశాం. కాంట్రాక్ట్ ఇప్పించిన తరువాత వారి వద్ద నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకునే బాధ్యత ఆర్‌వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ, శ్రీకాంత్, అనికీర్త్ బలోటా తీసుకున్నారు. వీరంతా డబ్బులు కలెక్ట్ చేసుకొని చంద్రబాబుకు అప్పగించే బాధ్యత తీసుకున్నారు. ఇవన్నీ ఇన్‌కంట్యాక్స్ అప్రైజల్ రిపోర్టులో వీరందరితో స్టేట్‌మెంట్లు, సంతకాలు తీసుకొని ఈ సంతకాలను శ్రీనివాస్ అనే వ్యక్తికి చూపించి.. చివరకు శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా దాన్ని అంగీకరిస్తూ సంతకాలు చేశాడు. మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తికి తన కంపెనీ కాకుండా ఎల్ అండ్ టీ నుంచి కూడా డబ్బులు రాబట్టే బాధ్యతను కూడా అప్పగించారు. ఎల్ అండ్ టీ కంపెనీ ద్వారా కూడా రూట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇవన్నీ అమరావతి ప్రాంతంలో, టిడ్కోలో, చివరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిర్మించే పనుల్లో కూడా ఆ స్థాయిలో దోపిడీ చేసి, ప్రజాధనాన్ని లూటీ చేశారు. చివరకు చంద్రబాబుకు దుబాయ్‌లో కూడా రూ.15.15 కోట్లు దినామ్‌లలో ఇచ్చినట్టుగా ఆధారాలతో సహా రాసి సంతకం చేసి మరీ ఇన్‌కంట్యాక్స్ డిపార్టుమెంట్‌కు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చింది. ఇదేకాకుండా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఉన్న వ్యక్తులు కూడా రూ.371 కోట్లు మూడు నెలల కాలంలో ఐదు దఫాలుగా ఇచ్చి.. లూటీ చేశారో అందులో కూడా పాత్రధారి యోగేష్ గుప్తా అనే వ్యక్తి ఆ స్కామ్‌లో, ఈ స్కామ్‌లో ఉన్నాడు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఆధారాలతో దొరికిపోయారు. ఇంత దారుణంగా ప్రజల డబ్బును లూటీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రఘు అనే వ్యక్తి రామోజీరావు కొడుకు వియ్యంకుడు. ఒక పద్ధతి ప్రకారం దొంగల ముఠాగా ఏర్పడి.. దోచుకో, పంచుకో, తినుకో అనే కార్యక్రమంలో భాగస్వాములై ఏరకంగా లూటీ చేశారో ఆధారాలతో సహా దొరికిపోయారు. ఇవన్నీ సభ ద్వారా ప్రజలందరికీ, ఎమ్మెల్యేలందరికీ తెలియాలని చెబుతున్నాం. ఇంతకుముందు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, గత ప్రభుత్వం కంటే ఇప్పటి ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేట్ కూడా తక్కువ. ఈ ప్రభుత్వం ఏరకంగా ప్రజలకు నేరుగా బటన్ నొక్కి డీబీటీ ద్వారా ప్రతి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా నాలుగు సంవత్సరాలు కూడా గడవకముందే అక్షరాల రూ. 2 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపించింది మన ప్రభుత్వం. ఎక్కడా లంచాలకు చోటులేకుండా, వివక్షకు తావులేకుండా నేరుగా బటన్ నొక్కుతున్నాం.. నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి, వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్ అయినప్పటికీ ఎందుకు అక్కచెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్లలేదు, ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి..? దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ స్కీమ్ ఏరకంగా జరిగిందనేందుకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాం.. రాష్ట్ర ప్రజలంతా ఆలోచన చేయాలి.