బాధితులకు సీఎం వైయస్‌ జగన్‌ పరామర్శ

తూర్పుగోదావరి: దేవీపట్నం వద్ద గోదావరిలో బోటు మునక బాధితులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. తాడేపల్లి నుంచి దేవీపట్నం చేరుకున్న వైయస్‌ జగన్‌ ముందుగా హెలికాఫ్టర్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఒకొక్క బాధితుడి దగ్గరకు వెళ్లి పరామర్శించి ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top