జ్యోతి య‌ర్రాజీకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

తాడేప‌ల్లి: 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ ప‌త‌కం సాధించిన జ్యోతి యర్రాజీకి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. థాయిలాండ్‌ వేదికగా గురువారం జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో విశాఖ‌కు చెందిన‌ జ్యోతి య‌ర్రాజీ 100 మీటర్ల హార్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచింది. ఈ నేపథ్యంలో జ్యోతిని అభినందిస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ట్వీట్ చేశారు. `విశాఖ‌కు చెందిన జ్యోతి యర్రాజీకి నా శుభాకాంక్షలు. 25వ ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ ప‌త‌కం సాధించి ఎవరికి సాధ్యం కాని రికార్డును అందుకున్నావు. మీరు మా అంద‌రినీ గర్వపడేలా చేశారు జ్యోతి యర్రాజీ` అని ట్వీట్‌ చేశారు. 

Back to Top