విభజన సమస్యలు పరిష్కారంలో ఆలస్యం అవుతున్నకొద్దీ తీవ్ర నష్టమే  

దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో వీటి ప‌రిష్కారంపై దృష్టిపెట్టాల్సిందిగా సమావేశంలో గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి

సెప్టెంబరు 3న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం చర్చించాల్సిన అంశాలపై  సీఎం వైయస్‌.జగన్‌ నేతృత్వంలో సమావేశం 

తాడేప‌ల్లి:  విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్‌ లాంటి నగరాన్ని కోల్పోయిందని, ఇప్పుడు విభజన సమస్యలు పరిష్కారంలో ఆలస్యం అవుతున్నకొద్దీ... రాష్ట్రానికి తీవ్రంగా నష్టమే జరుగుతోందని ముఖ్య‌మంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు.  అందుకే వీటి పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిందిగా సమావేశంలో గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. సెప్టెంబరు 3న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం చర్చించాల్సిన అంశాలపై  సీఎం వైయస్‌.జగన్‌ నేతృత్వంలో సోమ‌వారం తాడేప‌ల్లిలోకి క్యాంపు కార్యాల‌యంల‌తో సమావేశం నిర్వ‌హించారు. రాష్ట్రం తరఫున 19 అంశాలను అధికారులు అజెండాలో ఉంచారు. 

ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఏమన్నారంటే....:
– రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అయినా కూడా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి: సీఎం
– దీన్ని జోనల్‌ కమిటీ సమావేశంలో ప్రస్తావిస్తూ, వీటి పరిష్కారంకోసం సమావేశంలో దృష్టిపెట్టాలన్న సీఎం
– పరిష్కారాలను సూచించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా కోరాలన్న సీఎం.
– ఆ వ్యవస్థ కేవలం పరిష్కారాలను చూపించడమే కాకుండా తీసుకున్న నిర్ణయాలను అమలుచేసేదిగా ఉండాలంటూ గట్టిగా డిమాండ్‌ చేయాలన్న సీఎం. 
– విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్‌ లాంటి నగరాన్ని కోల్పోయిందని, ఇప్పుడు విభజన సమస్యలు పరిష్కారంలో ఆలస్యం అవుతున్నకొద్దీ... రాష్ట్రానికి తీవ్రంగా నష్టమే జరుగుతోందన్న సీఎం. 
– అందుకే వీటి పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిందిగా సమావేశంలో గట్టిగా ఒత్తిడి తీసుకురావాలన్న సీఎం. 
– పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి తగిన నిధులు విడుదల చేసే అంశాన్నికూడా అజెండాలో ఉంచాలన్న ముఖ్యమంత్రి. 
– తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌ వర్ధంతి సందర్భంగా తాను ఈ సమావేశాలకు హాజరుకావడం లేదన్న ముఖ్యమంత్రి. 
–ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నేతృత్వంలో రాష్ట్రం నుంచి ప్రతినిధి బృందం హాజరవుతుందని తెలిపిన సీఎం. 

ఈ సమావేశంలో విద్యుత్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధిక, ప్రణాళిక, శాససనభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, జీఏడీ ఎక్స్‌ అఫిసియో ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎల్‌ ప్రేమచంద్రారెడ్డి,  ప్లానింగ్‌ సెక్రటరీ జి విజయ్‌ కుమార్, లా సెక్రటరీ జి సత్య ప్రభాకర్‌రావు, హెం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top