‘ఈబీసీ’ పథకానికి కేబినెట్‌ ఆమోదం

సచివాలయం: అక్క‌చెల్లెమ్మ‌ల మేలు కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో వినూత్న పథకాన్ని రూపొందించారు. ఈబీసీ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా.. ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన ‘ఈబీసీ’ పథకానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45 వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందించనుంది. 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మహిళలకు ఈ పథకం వర్తించనుంది. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగులలోపు ఉంటే.. రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదే విధంగా నవరత్నాలు పథకాలపై ఈ ఏడాది క్యాలెండర్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు మంత్రిమండలి అంగీకారం తెలిపింది. 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాలను క్యాలెండర్‌గా రూపొందించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top