ఘ‌నంగా `జ‌గ‌న‌న్న జ‌న్మ‌దిన వారోత్స‌వాలు`

రాజమహేంద్రవరంలో 10 వేల మంది మహిళలతో మహా పాదయాత్ర

పాల్గొన్న డిప్యూటీ సీఎంలు అంజాద్‌బాషా, నారాయణస్వామి, ఎంపీలు, ఎమ్మెల్యేలు

తూర్పుగోదావరి: మహిళా అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని డిప్యూటీ సీఎంలు అంజాద్‌ బాషా, నారాయణస్వామిలు అన్నారు. అక్క‌చెల్లెమ్మ‌ల సంక్షేమానికి వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌మిస్తుంద‌న్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కాపు కార్పొరేషన్‌ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ‘జగనన్న జన్మదిన వారోత్సవాలు – ఊరూవాడా∙సంబరాలు’ పేరిట సీఎం వైయస్‌ జగన్‌ ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. కాగా, శనివారం 10 వేల మంది మహిళలతో మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం మెయిన్‌ రోడ్‌ నుంచి పుష్కర ఘాట్‌ వరకు 10 వేల మంది మహిళలతో మహాపాదయాత్ర నిర్వహించారు. అనంతరం పుష్కర్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 40 అడుగుల భారీ కటౌట్‌కు పూలాభిషేకం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు అంజాద్‌బాషా, నారాయణస్వామి, ఎంపీలు  వంగా గీత, చింత అనురాధ, గొడ్డేటి మాధవి, మార్గాని భ‌ర‌త్‌, ఎమ్మెల్యేలు జొన్నలగడ్డ పద్మావతి, నాగులాపల్లి ధనలక్ష్మి, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, జక్కంపూడి విజయలక్ష్మి, శ్రీ‌ఘాకొళ్ల‌పు శివ‌రామ సుబ్ర‌హ్మ‌ణ్యం, ఆకుల వీర్రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top