జ‌గ‌న‌‌న్న జ‌న్మ‌దిన వారోత్స‌వాలు- ఊరూవాడా సంబ‌రాలు

ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో గాదరాడ పీఠంలో చండీ హోమం 

నర్సరీలో ప్రభుత్వ పథకాలపై ఫల, పుష్ప ప్రదర్శన

తూర్పుగోదావరి: ఈనెల 21వ తేదీన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ‘జగనన్న జన్మదిన వారోత్సవాలు – ఊరూవాడా సంబరాలు’ పేరిట పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉండాల‌ని కోరుతూ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో గాదరాడ పీఠంలో చండీ హోమం నిర్వహించారు. అనంతరం కడియం పల్ల వెంకన్న నర్సరీలో ప్రభుత్వ పథకాలపై ఫల, పుష్ప ప్రదర్శన నిర్వహించారు. అంతే కాకుండా మొక్కలతో సీఎం వైయస్‌ జగన్‌ చిత్రపటాన్ని రూపొందించి.. ‘హ్యాపీ బర్త్‌ డే జననేత’ అంటూ నిన‌దిస్తూ సీఎంకు ముంద‌స్తు జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలిపారు.

రేపు 10 వేల మంది మ‌హిళ‌ల‌తో మ‌హా పాద‌యాత్ర‌
 ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంద‌స్తు జ‌న్మ‌దిన వేడుక‌లు తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో శ‌నివారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జ‌క్కంపూడి రామ్మోహ‌న్‌రావు ట్ర‌స్ట్ త‌ర‌ఫున నిర్వ‌హిస్తున్నారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేవ‌లం 18 నెల‌ల్లోనే మేనిఫెస్టోలో చెప్పిన వాగ్ధానాలు 90 శాతం అమ‌లు చేయ‌డ‌మే కాకుండా అక్కా చెల్లెమ్మ‌ల‌ను మ‌హిళా సాధికారిక‌త వైపు న‌డిపిస్తున్న శుభ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ జ‌గ‌న‌న్న జ‌న్మ‌దిన వేడుక‌లు జిల్లాలో ముంద‌స్తుగా నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే మూడు రోజుల పాటు వివిధ సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌గా, శ‌నివారం  ఉదయం 10 గంటలకు 10 వేల మంది అక్కా చెల్లెమ్మలతో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మున్సిప‌ల్ స్టేడియం నుంచి డీల‌క్స్ సెంట‌ర్ వ‌ర‌కు మహా పాదయాత్ర చేప‌ట్టి పుష్క‌ర ఘాట్ వ‌ద్ద ఏర్పాటు చేసిన వైయ‌స్ జ‌గ‌న్ భారీ క‌టౌట్‌కు గ‌జ‌మాల‌తో పుష్పాభిషేకం చేస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top