వైయ‌స్ఆర్‌సీపీలో నూతనోత్తేజం

ప్రతినిధుల సదస్సులో సీఎం ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు

ఎన్నికల కదన రంగంలోకి సమరోత్సాహం

సంక్షేమ పథకాల అమలుతో పార్టీపై ప్రజల్లో మరింత ఆదరణ

175కి 175 సీట్లు సాధిస్తామని ధీమా

వన్స్‌ మోర్‌ జగనన్న.. వై నాట్‌ 175, మా నమ్మకం నువ్వే జగన్‌ నినాదాలతో మార్మోగిన సదస్సు

విజ‌య‌వాడ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నిండుకోంది. నిన్న విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన పార్టీ విస్తృత స్థాయి ప్రతినిధుల సదస్సులో పార్టీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్‌ను నింపింది. 175కి 175 స్థానాలను సాధించడమే లక్ష్యంగా ఎన్నికల కదన రంగంలోకి దూకడానికి సీఎం మాటలు బూస్ట్‌ ఇచ్చాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత 52 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణల ద్వా­రా ప్రతి ఇంటికీ చేస్తున్న మంచిని వివ­రిస్తూ.. ప్రతి­పక్షాల తీరును ఎండగడుతూ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం ఆ పార్టీ ప్రతినిధుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టిం­పయ్యేలా చేసింది.

వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు సేనానులుగా.. సైనికులుగా పోరాటం చేస్తామని ప్రతినిధులు నినదించారు. ‘2024లో వన్స్‌మోర్‌ జగనన్న’, ‘జగనన్నే మా భవిష్య­త్తు’, ‘మా నమ్మకం నువ్వే జగన్‌’, ‘వైనాట్‌ 175’ నినాదాలతో ప్రతినిధుల సదస్సు ప్రాంగణం మార్మోగింది. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా విజయవాడలో సోమవారం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో పార్టీ ప్రతినిధుల సదస్సును వైయ‌స్ఆర్‌సీపీ నిర్వహించింది.

పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వ­య­కర్తలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షుల వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేల మందికిపైగా ప్రతినిధులు ఈ సమావేశానికి తరలివచ్చారు.

80 శాతం ప్రజల మద్దతుతో నూతనోత్సాహం..
గత సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలతో వైయ‌స్ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మేనిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామీలను సీఎం వైయ‌స్‌ జగన్‌ అమలు చేసి చూపారు. ఎక్కడా ఎలాంటి అవినీతికి తావులేకుండా, కులమతవర్గాలు, పార్టీలకతీతంగా అర్హతలున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించారు. దీంతో ప్రజల్లో వైయ‌స్ఆర్‌సీపీపై మరింత ఆదరణ పెరిగింది.ఆ తర్వాత మేనిఫెస్టోలోని వాగ్దానాలను 99 శాతం అమలు చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

స్థానిక సంస్థల పదవుల నుంచి కేబినెట్‌ వరకూ సామాజిక న్యాయాన్ని ఆచరించి చూపారు. అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశారు. పారిశ్రామి­కాభివృద్ధిని వేగవంతం చేసేలా భారీ ఎత్తున పోర్టులు, షిప్‌ యార్డ్‌లు చేపట్టడంతో అన్ని వర్గాల ప్రజల్లోనూ వైఎస్సార్‌సీపీకి ఆదరణ మరింత పెరిగింది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు.. తిరుపతి లోక్‌సభ.. ఆత్మకూరు, బద్వేలు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ రికార్డు విజయాలు సాధించడానికి దారితీసింది.

దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికీ చెప్పడానికి గతేడాది మే 11న చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మ­రథం పట్టారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని వివరిస్తూ.. ప్రతిపక్షాల దుష్ఫ్రచారాన్ని ఎండగడుతూ ఏప్రిల్‌ 7 నుంచి 29 వరకూ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి కూడా విశేష స్పందన లభించింది. 80 శాతం మంది ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికి మద్దతు పలకడం వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.

క్లీన్‌స్వీప్‌ ఖాయం..
ప్రభుత్వం చేసిన మంచి వల్ల ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కొట్టొచ్చినట్లు మార్పు కనిపిస్తోంది. ఇదే అంశాన్ని ప్రతి­నిధుల సదస్సులో సీఎం వైయ‌స్‌ జగన్‌ నొక్కిచెప్పడం శ్రేణుల్లో ఆత్మస్థై­ర్యాన్ని రెట్టింపు చేసింది. అధికారంలో ఉన్న ప్రభు­త్వానికి, పార్టీకి ఇంత సానుకూల­మైన వాతావరణం గతంలో ఎన్నడూ లేదనే అభిప్రాయాలు వ్యక్త­మ­వుతున్నాయి.

ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో తాము వైయ‌స్ఆర్‌సీపీ నేత, కార్యకర్తనంటూ ప్రజల్లో కాలరెగరేసుకుని తిరగగలు­గు­తున్నామని.. ఈ నేపథ్యంలో 175కు 175 స్థానాల్లో విజయం సాధించడం తథ్యమని విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చిన ప్రతినిధి సతీశ్‌ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల్లోవైయ‌స్ఆర్‌సీపీకి అత్యంత అనుకూలమైన వాతా­వరణం ఉందని వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా ప్రధాన కార్య­దర్శి కొండ్రెడ్డి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ దిశానిర్దేశం చేసినట్లుగా కలిసికట్టుగా కదిలితే క్లీన్‌స్వీప్‌ చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

Back to Top