పేదల పాలిట వరం సీఎం రిలీఫ్ ఫండ్

 ఉరవకొండ  మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదల పాలిట వరంలా మారిందని వైయస్ఆర్‌సీపీ ఉరవకొండ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను మాజీ ఎమ్మెల్యే అందజేశారు. శనివారం ఉరవకొండలోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో 70 మంది లబ్ధిదారులకు రూ.24.70 లక్షల చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందించటం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందన్నారు.ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రతి పేదవాడికి కార్పొరేట్‌ చికిత్సలు ఉచితంగా అందించేందుకు హెల్త్‌కార్డులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రైవేటులో చికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్​ ఫండ్​ ద్వారా సాయం అందిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా తమను ఆదుకున్నందుకు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తు ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు లబ్ధిదారులు. ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా చితికిపోయిన తమకు ముఖ్యమంత్రి సహయనిధి చేయూత నిస్తుందన్నారు. 

Back to Top