తాడేపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. జరుగుతున్న సంక్షేమం ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన. ఈ తరుణంలో.. కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఇంకేమి చేయాలి? అనే అంశాలపై సీఎం వైయస్ జగన్ సమీక్షిస్తున్నారు. అదే సమయంలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.