చిరువ్యాపారుల ఉపాధికి ఊతం `జ‌గ‌న‌న్న తోడు`

వ‌రుస‌గా నాల్గ‌వ ఏడాది మొద‌టి విడ‌త `జ‌గ‌న‌న్న తోడు` సాయం 

చిరు వ్యాపారాలు చేసుకునే వారికి రూ. 549.70 కోట్ల వడ్డీ లేని రుణాలు  

గతంలో తీసుకున్న రుణాన్ని చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ డబ్బు వారి ఖాతాల్లో జమ 

నేడు క్యాంపు కార్యాల‌యం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైయ‌స్ జగన్‌ 

తాడేప‌ల్లి: చిరువ్యాపారులకు అండ‌గా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ వ‌రుస‌గా నాల్గ‌వ ఏడాది మొద‌టి విడత నేడు అమ‌లుకానుంది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మ‌రికాసేప‌ట్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ఈ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తారు. ఈ ప‌థ‌కం కింద 5,10,412 మందికి ప్రభుత్వం మరో విడత వడ్డీ లేని రూ. 549.70 కోట్ల రుణాలను అందజేయడంతో పాటు గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. 

అధిక వడ్డీలతో కుదేలైపోతున్న చిరువ్యాపారుల దుస్థితిని చూసిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ వారికి చేయూతనందించడానికి 2020 నవంబరు 25వ తేదీన ‘జగనన్న తోడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తోపుడు బండ్లు, రోడ్ల వెంబడి చిన్న దుకాణాల్లో పండ్లు, కూరగాయలు వంటివి అమ్ముకోవడం, టీ, టిఫిన్‌ సహా పలు రకాల వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులకు, సాంప్ర‌దాయ చేతివృత్తుల క‌ళాకారుల‌కు జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం అండ‌గా నిలుస్తోంది. చిరువ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10,000 రుణం అందజేయడంతో పాటు తీసుకున్న రుణాన్ని ప్రతి నెలా కిస్తీ రూపంలో సకాలంలో చెల్లించే వారికి ఆ రుణంపై అయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. వారికి మరింత రుణ సాయాన్ని కూడా అందిస్తుంది. కొత్త వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందే వారిలో దాదాపు 85% మహిళలే ఉన్నారు. 

Back to Top